*ఎవడిచ్చాడు ఇలాంటి అధికారాలు…
*చట్టం చతికల బడి పోయిందా…
*రేషన్ మాఫియాపై ఇలా చేయలేదే…
*అక్కడ మామూళ్లు బాగా అందుతున్నాయని…
*సాయి కృష్ణ నేరుగాడే కావచ్చు…
*శిక్షించవచ్చు…అది న్యాయపరమైన విధానంలో…
*భక్షించడానికి వీరేమి యమ భటులు కాదుగా…
*ఎన్కౌంటర్ ,లాకప్ లో కొట్టి చంపితే నేరాలు తగ్గుతాయా…
*తప్పు చేస్తే నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టించాలి…
*ఒక నేరం కోసం మరో ఘోరం చేయ కూడదుగా…
*కాసులతో ఖాకీల కు కళ్ళు బైలు కమ్ముకుంటుంటే…
*అతడు నేరగాడే ఇప్పుడు వీరు క్రూర మృగాలా…
*కారుణ్యం లేని ఖాకీలను ఏం చేస్తారు…
*సస్పెన్షన్ చేస్తే ఓ సంవత్సరం లో పోస్టింగ్…
*చావుకు మళ్ళీ పుట్టుక ఉంటుందా…
*ఆ తల్లి కడుపు కోతకు ఖాకీలేమి చేస్తారు…
*ఇది ప్రజాస్వామ్యమా…పోలీసుల రాజ్యమా…

- సాయి కృష్ణను భూడిద చేసారా…భూ స్థాపితం చేసారా…
*సీపీ పర్యవేక్షణ చతికిల బడినట్లేనా…
*పోలీసులు తీరు మారేదెన్నడు…!
(రామమోహన్ రెడ్డి)
శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు. శాంతిభద్రతలను కాపాడటం, పౌరులను, వారి ఆస్తులను రక్షించడం, నేరాలను నిరోధించడం, దర్యాప్తు చేయడం, వారి అధికార పరిధిలో చట్టాలు, నిబంధనలను అమలు చేయడం వంటివి పోలీసుల బాధ్యత.పోలీసు విధుల్లో ప్రాణం మరియు ఆస్తిని రక్షించడం, క్రిమినల్ చట్టాన్ని అమలు చేయడం, నేర పరిశోధనలు, ట్రాఫిక్ నియంత్రణ, గుంపు నియంత్రణ, ప్రజా భద్రతా విధులు, పౌర రక్షణ, అత్యవసర నిర్వహణ, తప్పిపోయిన వ్యక్తుల కోసం వెతకడం, పోగొట్టుకున్న ఆస్తి మరియు పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన ఇతర విధులు ఉన్నాయి.చట్టాన్ని అమలు చేయడం అనేది పోలీసింగ్ కార్యకలాపాలలో ఒక భాగం మాత్రమే. పోలీసింగ్ వివిధ పరిస్థితులలో అనేక రకాల కార్యకలాపాలను కలిగి ఉంది, కానీ ప్రధానమైనవి శాంతిభద్రతలను కాపాడటానికి సంబంధించినవి.ఏ సందర్భంలో గాని పోలీసులు ప్రజలను కొట్టే అధికారం లేదు. ఒక వేళ మిమ్మల్ని కొడితే పోలీసు యాక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం ఆ పోలీసు అధికారికి 3 నెలల జైలు శిక్ష లేదా జరిమానాతో కూడిన శిక్ష వేయవచ్చని చట్టంలో ఉన్న నిబంధనలు చెబుతున్నాయి. సాధారణంగా పోలీసులు నిస్వార్థం, సమగ్రత, నిష్పాక్షికత, జవాబుదారీతనం, నిష్కాపట్యం, నిజాయితీ న్యాయం మరియు గౌరవం కలిగిఉండాలని సహజ న్యాయ సూత్రాలు వెల్లడి చేస్తున్నాయి.ఇన్ని రకాలుగా చట్టం న్యాయం ధర్మం అని వ్యవస్థ పుట్టుక గురించి తెలియ పరిచిన పోలీస్ శాఖ ఆ విదంగా నడుచుకుంటూ ఉందా అంటే అది అసాధ్యమని చెప్పాలి.ఖాకీ దుస్తులు ధరించిన మాత్రానా భగవంతుడు వీరికి విశేష అధికారాలు ఇచ్చిన చందంగా ప్రవర్తన ఉండటం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న అనాదిగా ఉంది. ఇందుకు సంబంధించిన విషయాలలోకి వెళితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన ఎన్ఠీఆర్ కమిషనరేట్ పరిధిలో ని కృష్ణ లంక పోలీస్ స్టేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ స్టేషన్ పరిధిలో కొన్ని నేరమయ సంఘటనలకు పాల్పడి మార్కాపురంలో ఉంటున్న గాదె సాయి కృష్ణ అనే అతని అరెస్ట్ ఆ తరువాత అతని ఆచూకీ లేక పోవడం తో సాయి కృష్ణ తల్లి హైకోర్టును ఆశ్రయించిన తరువాత ఒక్కొక్క టిగా వెలుగులో కి వస్తున్న విషయాలు చూస్తే ప్రజలు ఏలాంటి సమాజంలో జీవిస్తున్నారన్న సందేహం కలుగుతోంది. కారణం ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన గాదె సాయి కృష్ణ జీవితం నేరాలతో కూడుకున్న దనే విషయం వారి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకుంటు న్నారు. అయితే నేరానికి సంబంధించి కోర్టు పరిధిలో ఉండి నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఉండటం తో కృష్ణ లంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు గత నెల 9వతేదిన గాదె సాయి కృష్ణ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి కోర్టుకు హాజరు పర్చకుండా అరెస్ట్ చూపించ కుండా 39 రోజులు దాటినా ముద్దాయిగా ఉన్న సాయి కృష్ణ ఆచూకీ లభ్యం కాలేదని తల్లి ,అతని కుటుంబ సభ్యులు హైకోర్టు ను ఆశ్రయించారు ఆ తరువాత మాజీమంత్రి అంబటి రాంబాబు సాయి కృష్ణ ను సిఐ నాగరాజు చిత్ర హింసలు చేసినట్లు కొన్ని ఫోటోలు విడుదల చేయడం అది కాస్తా రాజకీయ రంగు కాపు సామాజిక వర్గం నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో కూటమి ప్రభుత్వం సిఐ నాగరాజును విఆర్ కు పంపి ఆ వెంటనే సస్పెన్షన్ చేయడం ఒక ఐపిఎస్ అధికారి తో విచారణకు ఆదేశించారు. అయితే ఇవన్నీ ఇలా ఉండగా అసలు సాయి కృష్ణ బ్రతికి ఉన్నాడా బూడిద గా మారిపోయాడా అన్న పీట ముడి వీడలేదు. అయితే సాయి కృష్ణ కుటుంబీకులు అటు కాపు నాయకులు వైసీపీ పార్టీ వారు లేవనెత్తుతున్న అంశాలు పోలీస్ వర్గాల్లో నడుస్తున్న చర్చను బట్టి చూసై సాయి కృష్ణ పై దర్ద్ డిగ్రీ ప్రయోగం చేయడం సీఐ నాగరాజు సాయి కృష్ణ కాలి గోర్లు కూడా పీకేసి టార్చర్ పెట్టుడం అది భరించలేక సాయి కృష్ణ లాకప్ డెత్ అవ్వగా ఆసుపత్రికి తరలించిన ఉపయోగం లేక పోవడంతో శవాన్ని కూడా భూడిద చేశారన్న ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.అలా ఎందుకు అనాల్సి వస్తోందంటే సాయి కృష్ణ ఉదంతం రాజకీయ రంగు కుల బలం తోడై రాష్ట్రస్థాయి సమస్య గా మారిన తరువాత కూడా పోలీస్ శాఖ నుంచి ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదంటే జరుగుతున్న ప్రచారం సాగుతున్న చర్చ నిజమేనని అనుకోక తప్పడం లేదు.ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో పోలీసు శాఖ పై ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఒక వ్యక్తి ఎంతటి కరుడు గట్టిన నేరగాడయిన చట్టవ్యతిరేకమైన విధానం ప్రదర్శించకూడదనేది చట్టం చెబుతోంది. న్యాయస్థానం ముందు దోషిగా రుజువు చేసి శిక్ష పడేలా చేయాలే తప్ప చట్టాన్ని చేతుల్లో కి తీసుకుని హింసించి చంపడం అనేది చాలా దారుణమని అంటున్నారు మేధావులు. ఇలాంటి పరిస్థితుల్లో వీరు పోలీసులేనా నరరూప రాక్షసులా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జరిగిన సంఘటన బట్టి కృష్ణ లంక పోలీసు ల పై అనేక రకాల ఆరోపణలు గుప్పుమంటున్నాయి.కేవలము సేటిల్మెంట్ లకే ప్రాధాన్యత ఇస్తూ రేషన్ మాఫియా కలెక్షన్స్ కోసం కానిస్టేబుల్ అశోక్,రామకృష్ణ, నాగభూషణం ఇలా ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకుని నిత్యం కాసుల కోసమే అన్నట్లు ఖాకీ యూనిఫామ్ లేకుండా కొందరు మరికొందరు ఖాకీ ముసుగులో కాగితాల వేట ఆడి తమ పబ్బం గడుపుకునే వారన్న విమర్శలు వచ్చిపడుతున్నాయి.ఏదయినా సంఘటన జరిగిన తరువాతే జరిగిన తప్పులు అవినీతి అక్రమాలు బైటికి రావడం సహజంగా మారిపోతున్నాయి.ఇక్కడ ఇప్పుడు ప్రధాన సమస్య గా మరీన సాయి కృష్ణ వ్యవహారం తరువాత ఎన్టీఆర్ కమిషనర్ పై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సీపీ రాజశేఖర్ బాబు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లిక్కర్ కుంభకోణం కేసు లో మునిగి పోయి తన కమిషనరేట్ పరిధిలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్దగా దృష్టి సారించక పోవడం కూడా ఇలాంటి సంఘటనలు తలెత్తాయన్నది ప్రజల్లో చర్చ జరుగుతోంది. అయితే నిజంగా సాయి కృష్ణది లాకప్ డెత్ అయి భూడిద గా మారితే కూటమి ప్రబుత్వం పెద్ద మూల్యం చెల్లించు కోక తప్పదన్న వాదన లేక పోలేదు.సిఐ నాగరాజు ఇతర సిబ్బంది ని మహా అయితే సస్పెన్షన్ చేస్తే ఏడాది లేదా మరో ఆరు నెలల్లో ఉద్యోగం వస్తుందని తీసేసిన ప్రాణం వంద వేయి సంవత్సరాలైన తిరిగి తీసుకు వస్తారా అన్న ప్రశ్న ప్రజల్లో నడుస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో సాయి కృష్ణ ఉదంతం ఏ మలువు తిరుగుతుందో వేచిచూడక తప్పదు.


