టాప్ న్యూస్ఓ కాలజ్ఞాని ఇది వీరి అజ్ఞానమా..అహంకారమా..?

ఓ కాలజ్ఞాని ఇది వీరి అజ్ఞానమా..అహంకారమా..?

స్వామి వీరప్పయ్య ఏమిట య్యా ఈ విడ్డురాలు…
*పీఠం కోసం ప్రాకులాటలు…
*మఠం పరువు మట్టిలో కలిపివేస్తున్నారే…
*వారసత్వం కోసం వీధి కెక్కారు…
*వీర గురుని పరువు వీధుల పాలు చేస్తున్నారే…
*తాత్కాలికం శాస్వితం అయితే ఓకే…
*తాత్కాలికం తప్పని తీర్పు వస్తే….
*ఈ అధర్మాయ అధికారుల తీరు ఇలాగేనా…
*వీర గురుని వ్యాఖ్యలు నిజం కాబోతున్నాయా…
*సొమ్ము భక్తులది…సోకు వీరిదా…
*వీరికి కావాల్సింది సాంప్రదాయాలా…సొమ్ములా…
*సాంప్రదాయాలు ఉంటే ఇలా దిగజారి ప్రవర్తిస్తారా…
*వీరికి ఉన్నది భక్తి భావమేనా…
*భక్తి భావం ఉంటే ఇంత బజారు పాలు అవుతారా…
*అహో వీర బ్రహ్మ వీరి భాగోతం చూడవయ్యా…
(రామమోహన్ రెడ్డి)
మఠం,అనగా సర్వం పరిత్యజించిన సన్యాసులు, యోగులు, మొదలగువారు తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నెలవుగా ఉండే ప్రదేశం. మఠంలో దేవుని ప్రతిష్ఠించి అక్కడ పూజా విదులను నిర్వర్తిస్తూ, ప్రజలకు జ్ఞానాన్ని హిందూధర్మ విశ్వాసాల సారాన్ని, వేద సారాన్ని, మంచి చెడ్డలను భోదిస్తూ సన్యాసులు అందులో జీవిస్తుంటారు.పీఠాధిపతి అనగా మతపరమైన పీఠానికి లేదా మఠానికి అధిపతి అని అర్థం.సాధారణంగా హిందూ, జైన లేదా ఇతర మత సాంప్రదాయాలలో ఒక ఆధ్యాత్మిక సంస్థను లేదా మఠాన్ని నడిపించే గురువులను, స్వామీజీలను ఇలా పిలుస్తారు. మత సంప్రదాయాలను, ఆచారాలను కాపాడటం మరియు వాటిని అనుసరించే వారికి మార్గదర్శనం చేయడం, భక్తులకూ, సమాజానికీ ఎదురయ్యే ధర్మ సంకటాలకు వేదాంత పరమైన పరిష్కారాలు, సూచనలు ఇవ్వడం మఠానికి సంబంధించిన బాధ్యతలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు ధార్మిక విద్యను పర్యవేక్షించడం పీఠాధిపతి ప్రధమ కర్తవ్యం.
సాంప్రదాయం అనేది ఒక తరం నుండి మరో తరానికి అందించబడే ఆచారాలు, విశ్వాసాలు మరియు ప్రవర్తనా విధానాల సముదాయం. ఇది సమాజంలో లేదా కుటుంబంలో కాలక్రమేణా నిలకడగా కొనసాగే పద్ధతులను సూచిస్తుంది.ఆచార వ్యవహారాలు అనగా సమాజంలో కాలక్రమంగా ఏర్పడిన సాంప్రదాయాలు, నిత్యజీవిత పద్ధతులు మరియు ప్రత్యేక సందర్భాలలో పాటించే కార్యకలాపాలు. ఇవి మనిషి ప్రవర్తనను, నైతికతను మరియు సామాజిక ఐక్యతను కాపాడుతాయి.
భక్తి అంటే దేవుని పట్ల లేదా గురువు పట్ల చూపించే లోతైన ప్రేమ, గౌరవం, శ్రద్ధ మరియు అంకితభావం. ఇది కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, మనసును పూర్తిగా దైవానికి సమర్పించుకునే ఒక పవిత్రమైన భావన.భక్తిలో ప్రేమ సేవ,శరణాగతి ఉండలంటారు.ప్రేమ అంటే ఔహిక మైన ప్రేమలు ఫేస్బుక్,వాట్సప్ వి కావు. భగవంతునిపై నిస్వార్థమైన మరియు స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉండటం.శరణాగతి అంటే భగవంతుడే సర్వస్వమని నమ్మి తలవంచడం.సేవ అంటే ఇష్టదైవానికి నిత్యం సేవ చేస్తూ తన్మయ చెందడం.ఈ భక్తిలో శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఉండాలి.అహంభావం విడిచిపెట్టి అందరిలోనూ దైవాన్ని చూడటమే అసలైన భక్తి అని మహర్షులు చెప్పియున్నారు.
భుక్తి అనగా భోజనము, ఆహారము లేదా భౌతిక సుఖాలను అనుభవించుట అని అర్థము. జీవనాభివృద్ధికి అవసరమైన తిండి లేదా భోజనం. ఇంద్రియాల ద్వారా లభించే భౌతిక సుఖాలను అనుభవించడం. ఆధ్యాత్మిక మార్గంలో దీనిని లౌకిక సుఖాల కోరికగా చెబుతారు. జనన మరణాల నుంచి విముక్తిని కోరేది ‘ముక్తి’ అయితే, లౌకిక భోగాలను కోరేది ‘భుక్తి’.మరి వీరిలో ఎవరిది భక్తి ఎవరిది భుక్తి అని చెప్పాలంటే ఆ కాలజ్ఞాని మత్తమే సరైన నిర్ణయం వెలువరిస్తారని స్వామి భక్తుల విశ్వాసం.
” నాది నీది” అనగా వస్తువులు, హక్కులు లేదా బాధ్యతల విషయంలో నాది , నీది అని వేరు చేసి చూపేది యాజమాన్యం లేదా భేదభావం. ఇది మనుషుల మధ్య ఆస్తులు, భావాలు లేదా సంబంధాలను పంచుకునే సందర్భంలో వాడబడుతుంది.
పూజ అనేది హిందువులు, బౌద్ధులు, జైనులు దేవతలకు భక్తి శ్రద్ధలతో చేసే ప్రార్థన. అతిథికి ఆతిథ్యం ఇవ్వడం, గౌరవించడం లేదా ఒక కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా జరుపుకోవడం ఆరాధన కూడా పూజయే. గురుపూజ అంటే
గొప్ప ఆధ్యాత్మిక గురువుల విషయంలో జీవించి ఉన్న గురువులకు కూడా పూజ చేస్తారు.గురువులను పూజా వస్తువులుగా ఎంచుకుంటారు. సజీవ దేవతలుగా గౌరవిస్తారు, దేవతల స్వరూపాలుగా చూస్తారు. గురువులను కొన్నిసార్లు ప్రతీకాత్మక వస్త్రాలు, దండలు, ఇతర ఆభరణాలతో అలంకరించి, ధూపం వేసి, వారి పాదాలను కడిగి, అభిషేకించి, వారికి పండ్లు, ఆహారం, పానీయాలు ఇచ్చి వారి పాదాల వద్ద ధ్యానం చేస్తూ వారి ఆశీర్వాదం కోసం వేడుకుంటారు.
సనాతన ధర్మం అనగా ఆది, అంతం లేని శాశ్వతమైన జీవన విధానం. ఇది ఏ ఒక్క వ్యక్తి చేతనో లేదా ప్రవక్త చేతనో స్థాపించబడలేదు. హైందవ సంప్రదాయంలో మానవులకు సరైన నడతను, విశ్వసత్యాలను నేర్పించే సార్వత్రిక నియమాల సముదాయం ఇది.హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మానవ జీవితంలోని నాలుగు దశలలో (ఆశ్రమాలలో) ఇల్లు మరియు కుటుంబాన్ని బాధ్యతగా నిర్వహిస్తూ, వివాహ జీవితాన్ని గడపడమే గృహస్థాశ్రమం. ఇది బ్రహ్మచర్యానికి తరువాత వచ్చే రెండవ దశ. మిగిలిన అన్ని ఆశ్రమాలకు (బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసం) ఇదే ప్రధాన ఆధారంగా నిలుస్తుంది.
ఇప్పటివరకు చెప్పబడినవి సృష్ఠికి ఆదారభూతంగా మానవుని పరిణామ క్రమంలో భగవంతుడు, భక్తి, గురువు, సనాతన ధర్మం, ఆచార వ్యవహారాలు, పూజలు, వాటి ఆచరణ భగవంతుడు ని ఆరాధించే క్రమంలో పద్ధతులు, ఆ పద్ధతులు కలిగిన వారు ఎవరు ఎలా ఉండాలో సాధారణ మనిషి జీవితంలో తెలుసుకునే అతి ముఖ్యమైన అంశాలు.ఎందుకంటె మనము చర్చించుకుబోయే అంశం చాలా పవిత్రమైనది.అలాంటి పవిత్రమైన అంశాన్ని పరువు ప్రతిష్ట అనేవి ఏ మాత్రం ఆలోచన చేయకుండా తమ ప్రాపకం కోసం పరితపిస్తూ ఈ ప్రపంచానికి భూత భవిష్యత్ వర్తమాన కాలగతులు నాలుగవ శతాబ్దంలోనే తెలియపరిచి రాజయోగం ద్వారా సిద్ధి బుద్ధి ఎలా పొందాలో మార్గాన్ని సుగమమం చేసిన పరమ పవిత్రమైన యోగి,సంఘ సంస్కర్త శ్రీ జగద్గురు మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం నేడు మఠం వారసులమని చెప్పుకునే వారు అధికార యావతో చేస్తున్న పలు వికృతమైన కార్యక్రమాలు సమాజాన్ని తల దించుకునేలా ఉన్నాయని చెప్పడం లో తప్పేమీ కాదని పిస్తోంది.
ఎందుకయ్యా అంటే అక్కడ జరుగుతున్న సంఘటనలు యాదృచ్చికంకాక పోయి ఉంటే అయ్యో అని అనుకోవచ్చు. కానీ అవి కేవలము భక్తుల సొమ్ము కోసమే అన్న భావన వచ్చేలా బ్రహ్మంగారి వారసులమని చెప్పుకునే వారు చేస్తున్న నిత్య కృత్యాలు బ్రహ్మంగారి భక్తుల విశ్వాసాలు దెబ్బతీసే విదంగా ఉన్నాయని చెప్పలి. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే వీరు నిజంగా బ్రహ్మంగారి వారసులేనా అన్న అనుమానాలకు తావిస్తునట్లు అగుపిస్తోంది.
శ్రీ బ్రహ్మంగారు గొప్ప రాజయోగి గొప్ప సంసారి కూడాను.సంసారమందు ఉంటూ సంసారం చేయుచు సిద్ధిని పొందు సిద్దా అని సిద్ద గురుబోధనలో స్వామి చెప్పియున్నారు. అంటే సంసారం అనేది సహజ సిద్ధంగా ఉండాలని ఆ సంసారమ్ అనే ముసుగులో పడి కొట్టుక చావద్దని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నిత్యం స్వామి సజీవ సమాధి ప్రాంగణంలో జరుగుతున్న వారసత్వ పోరు స్వామి పరువును వీధుల్లో ఉంచడం కాదా అన్నది స్వామి వారసులే ఈ బాహ్య ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వారసత్వ పోరులో సోషియల్ మీడియాతో పాటు పలు ప్రధాన మీడియాలో జరుగుతున్న ప్రచారాలు శ్రీ బ్రహ్మంగారి మఠం చరిత్రలో మొట్ట మొదటిసారివని చెప్పాల్సి రావడం అత్యంత బాధాకరమని చెప్పాలి. అసలు ఈ వారసుల మధ్య జరుగుతున్న పీఠం పోరులో పరువు అనే పదాన్ని పూర్తిగా విస్మరించడం చూస్తుంటే వీరు అసలు ఆపీఠానికి అర్హులేన అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటివరకు శ్రీ మఠం చరిత్రలో ఏడు తరాలు పదకొండు మంది పీఠాధిపతులు స్వామి మఠాన్ని పర్యవేక్షణ చేస్తూ స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించే వారు.మఠం పరంపరలో ఒక పదకొండవ పీఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి మాత్రమే ఐదు దశాబ్దాలుగా పీఠాన్ని అధిరోహించి శ్రీ స్వామి ప్రతిష్టతో పాటు మఠం అభివృద్ధి లో కీలక భూమిక పోషించారు. అలాంటి ఆయన జీవితం అనూహ్య మలువు తిరిగింది.
ఆయన మొదటి భార్య మాతా చంద్రావతమ్మ అనారోగ్యంతో పరమపదించారు.ఆ తదనంతరం ఆయన మరో వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా మారుతి మహాలక్షుమ్మను రెండవ వివాహం చేసుకోవడం ఆమెకు ఇద్దరు మగసంతానం కలగడం వారు అల్లారు ముద్దుగా పెరగడం తండ్రి అడుగుజాడల్లో ఆధ్యాత్మిక చింతనతో బాల్యాబ్యాసం చేస్తుండగానే ఆయన కూడా కరోనాతో పరమపదించడం జరిగింది. ఆ తదనంతరం ఆయన వారసత్వం కోసం మొదలైన రగడ రాజకేయ రంగు పులుముకుని రాష్ట్రం దేశం దాటి యావత్ ప్రపంచం మొత్తం కూడా బ్రహ్మంగారి మఠం పీఠానికి వారసుడు ఎవరూ అన్న ధర్మ సందేహం వ్యక్తం చేస్తుండగా అనూహ్య పరిణామాల నేపధ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్న అ ధర్మాదాయ శాఖా అధికారులు కేవలం మఠం యొక్క ఆచార వ్యవహారాలు మాత్రం చూడడానికి తాత్కాలిక పీఠాధిపతి గా దివంగత పీఠాధిపతులు శ్రీవీర భోగ వసంత వేంకటేశ్వర స్వాముల వారి మొదటి భార్య పెద్దకొడుకు వేంకటాద్రి స్వామి ని ఎన్నిక చేస్తూ తదుపరి కోర్టు ఉత్తర్వులు మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్థర్ ఇవ్వడం జరిగింది.
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహమునాడు పొందుర సుమతీ !
ఓ సుమతీ ! కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలుగదు. కాని ఆ కొడుకు
గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన
సంతోషము కలుగును అన్నట్లు పూర్వపు పదకొండవ పీఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వారికి తన మొదటి సంతానం లో రెండవ కుమారుడు వీరభద్రయ్య స్వామి మినహా మిగిలిన ముగ్గురు కుమారుల పై చెప్పుకోదగ్గ ప్రేమాభిమానాలు లేవన్న ఆరోపణలు అప్పటి నుంచి అక్కడ వినిపిస్తూనే ఉన్నాయి.అయితే ఆయన రెండవ భార్య సంతానంతో పుత్ర వాత్సల్యం బాగా ఉన్నదనేది అక్షర సత్యం. ఈ నేపధ్యంలో ఆయన ముందుగానే తన రెండవ సంతానం పెద్ద కుమారుడు శ్రీ గోవింద స్వాముల వారికి గురూపదేశం చేసి ఆధ్యాత్మిక రహస్యాలు జేజినాయన మార్గదర్శనం చిన్న నాటి నుండి అలవరచుకునేల సాధన వైపు ఆడుగులు వేయించారు. ఆ సాధనలో ఫలితం కనిపిస్తుండడం తో తరవాతి మఠం పీఠాధిపతి గా శ్రీ గోవింద స్వామి అర్హుడని వీలునామ వ్రాయించి ఇచ్చారు.అయితే అదే వీలునామా లో మొదటి భార్య సంతానం పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ భౌతిక ప్రపంచంలో ఏ తండ్రి కూడా అందులోనూ సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉండి మఠం పీఠాధిపతి గా ఉన్న వారు అలా రాయడం అంటే అక్కడే అర్థం అవుతుంది ఆ కుటుంబ పరిస్థితి ఏమిటో అన్నది.ఇలా ఆయన పరమ పదించిన అనంతరం ఆయన రెండవ బార్య మారుతీ మహాలక్షుమ్మ తన పెద్ద కుమారుడి వారసత్వం కోసం కోర్టును ఆశ్రయించడం జరిగింది .ఇలా కోర్టుల్లో వ్యవహారం ఉండగా మారు తల్లి మారుతీ మహాలక్షుడమ్మ పై ప్రస్తుత తాత్కాలిక పీఠాధిపతి చేసిన ,దగ్గరుండి చేయించిన అసత్యపు ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో ప్రదాన మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారయన్నది అందరికి విదితమే. అయితే అవి కాస్త కన్న తల్లి లాంటి మారు తల్లి పై సోదరుడు శ్రీ గోవింద స్వామి పై శ్రీ వేంకటాద్రి స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.మారు తల్లి పిల్లలు పుట్టుక,ఆమె నివాసం ఉంటున్న మహానివేదన మందిరంలో చేసిన దారుణాలు ఆపై పీఠాధిపతి గా తాత్కాలికంగా ఉంటున్న వ్యక్తి అనుసరించిన తీరు నిజంగా చాలా ఆక్షేపణనీయమనే చెప్పాలి. కేవలం పీఠం కోసం ఇంతటి దౌర్భాగ్యం కు దిగజారడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న యావత్ బ్రహ్మంగారి భక్తుల్లో కలకలం రేపుతోంది. వీరు నిజంగా బ్రహ్మంగారి పీఠం పై భక్తితో ఉన్నారా పీఠం పేరుతో భుక్తి కోసం ఆరాట పడుతూ ఉన్నారా అన్న ధర్మ సందేహం వ్యక్తం చేస్తుండగా ఇక ఆ కాలజ్ఞాని వీర బ్రహ్మేంద్ర స్వామి నే ఆయన వారసుడి ని ఎంపిక చేసుకోవాలన్న భక్తి భావన కలుగుతుంది. చూడాలి ఆ జేజినాయన ఎలా తనమహిమ చూపుతారా అన్నది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article