అందుకే ముఖ్యమంత్రి జిల్లా సమాచారం వేలాయుధం చేతిలో ఉంది…
చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా చింతన పడడం లేదంటా…
వాహనాల మరమ్మతుల మర్మం వేలాయుధం కే ఎరుక…
డ్రైవర్ ఒక్కడే డ్రైవింగ్ విధానం సూపర్
ఇక్కడ డ్రైవర్ కు తెలియకుండానే వాహనాల రిపేరు గుర్తిస్తారు వేలాయుధం…
అది సత్య సాయి జిల్లా అయిన చిత్తూరు ,తిరుపతి అయినా…
న్యూడ్ వీడియోల కథ కంచికి చేరిందా…
సైబర్ క్రైం శోధనలో సత్యం బోధపడిందా…
లేక సైబర్ క్రైం లోనే మరో క్రైం కు తావిచ్చారా…!
జోన్ 4 ఆర్జేడీ కి అన్ని తెలిసినా…
ఆయన రిపోర్టులలోనే అంతా బట్టబయలైన…
అంతా మౌనమై ఉండడంలో ఆంతర్యమేమిటో…
ఆర్జేడీ అలసత్వం కూడా శాఖ అప్రతిష్ఠపాలవ్వలేదా …
రాయలసీమలో ఇలాంటి రత్నాలు కథలను కట్టడి చేయలేరా…
కుల బలం ఇన్ని కుట్రలను కాపాడుతూ ఉందా….
కుల బలం ఉంటే ఎన్ని కానీ పనులైన చేయొచ్చా….
పత్రికల పై ఫిర్యాదులిస్తే పరుగులు తీస్తారా…
అదే పత్రికల లో తప్పులు ఎత్తి చూపితే తప్పుడు నివేదికలు ఇస్తారా….
మీదయితే సంసారం…ఎదుటివాడిది.**నేనా….!
ఎవడు రాసాడు ఇలాంటి రాజ్యాంగం…
ఏళ్ళు గడుస్తున్నా గడపదాటదా మీ అవినీతి గబ్బు….
నివేదికలు స్పష్టంగా చెబుతున్నా… ఆ జోన్ లో అంతా అస్తవ్యస్తంగా ఉన్నా…
అక్కడే ఉద్యోగం ..ప్రమోషన్ అన్నీ…. *తప్పుడు అధికారులను సరిదిద్దే వారెవరులేరా… *సమస్య లకు నిలయం సమాచార శాఖ అయ్యిందా…? *ఏది నిజం… ఏది అబద్దం…
(రామమోహన్ రెడ్డి)
మన హిందూ మతము పేరు చెప్పగానే మొదట అందరికీ గుర్తుకు వచ్చేది కులాల సంగతి. హిందూమతమునకు ప్రామాణ్యము వేదాలు అని అందరికీ తెలుసు. స్త్రీలు, శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని అలా అని వేదాలలో ఉన్నదని చాలామంది నమ్ముతున్నారు. కానీ వేదాలలో అలా లేదని చెప్పడానికి ఈ ప్రయత్నం. భగవధ్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు “చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః”అన్నాడు. దీని అర్థం”మొదట వారి గుణాల బట్టి, తర్వాత వారు చేసే పనుల బట్టి నాలుగు వర్ణాలు (కులాలు) నాచే (భగవంతుడిచే) సృష్టింపబడ్డాయి.“అని అర్థం. వేదాలలో నాలుగు వర్ణాల (కులాల) గురించి చెప్పారు కానీ వాటి మధ్య ఎక్కువ, తక్కువల గురించి చెప్పలేదు. మధ్యయుగంలో సాంప్రదాయవాదులు స్త్రీ,శూద్రులకు వేదాధ్యయనాధికారం లేదని వారి వారి గ్రంథాలలో చొప్పించారు కానీ ఏ వేదంలోనూ అలా చెప్పబడలేదు. సరిగదా ఆ అధికారం ఉన్నదని చెప్పాయి. కులం అనేది సమాజంలో ఏ వ్యక్తినైనా తేలికగా గుర్తించడానికి రూపొందించిన ఒక వ్యవస్థ. తమలో తాము వివాహాలు చేసుకుంటూ, ఒక విధమైన జీవన సరళిని కొనసాగిస్తూ వచ్చిన సామాజిక వర్గాలకు కులాలు అని పేరు. వృత్తి, ఆచారాలు, సామాజిక స్థాయి వంటి అనేకాంశాలు కులాల్లో పరంపరాగతంగా కొనసాగేవి. వంశపారంపర్యంగా పాటించబడే ఒక సామాజిక ఆచారం. సాధారణంగా కులం వృత్తులు, కులవివాహాలు, సంస్కృతి, సామాజిక స్థాయి, రాజకీయాలపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది. యునిసెఫ్ అధ్యయనాల ప్రకారం కులవివక్ష ప్రపంచవ్యాప్తంగా 25కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఈ కుల వ్యవస్థ ప్రముఖంగా ఆసియా ఆఫ్రికా ఖండాలలో ప్రబలి ఉంది. భారత దేశంలో కుల వ్యవస్థ వలన కొన్ని దురాచారాలు ఏర్పడినవి. ఇప్పుడు కూడా కుల వ్యవస్థ ఉనికిలో ఉన్నప్పటికీ సమాజంలో కులం కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.పూర్వం కూటికి పేదలం కానీ కులానికి పేదలం కాదు అనేవారు. ఇప్పుడు కొంత మంది కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు కానీ అక్కడ కూడా తమ డబ్బు-హోదాకి తగిన వ్యక్తుల్నే ఎంచుకుంటున్నారు. ఉన్నవాళ్ళు-లేనివాళ్ళు అనే భేదం ఎప్పుడూ ఉంటుంది. సొంతకులంలో కూడా డబ్బున్న కుటుంబాలకి చెందిన వాళ్ళు పేద కుటుంబాలకి చెందిన వాళ్ళని పెళ్ళి చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. పట్టణ ప్రాంతాలలోనూ, కొన్ని గ్రామీణ ప్రాంతాలలోనూ కుల పునాదులు అంత బలంగా కనిపించడం లేదు. అంత కంటే డబ్బున్న వాళ్ళు – పేద వాళ్ళు అన్న భేదాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఇప్పుడు ఎందుకు కుల వ్యవస్థ ను ప్రస్తావన తీసుక రావాలి అనే సందేహం చాలామంది కి రావచ్చు.కానీ అక్కడే అసలైన అంతరార్థం దాగి ఉన్నదన్న సత్యం అనేక విషయాలను పూర్తిగా ఆదారసాహిత నివేదికలను నిశితంగా పరిశీలన చేసిన తరువాత వ్యవస్థలలో ద్విగునీకృతమై ఉన్న అవినీతి అనేది కులం ప్రాంతం నోట్ల కట్టల మాటున ఈ సమాజాన్ని ఎంత ప్రతికూల పరిస్థితులలోకి నెట్టి వేయబడుతుందనేది అట్లే అర్థం చేసుకోవచ్చు. ఏమిటయ్యా ఈ పురాణ ఇతిహాసాలతో కూడిన రాతలని కొంతమంది అపర మేధావులమనే ముసుగువేసుకున్న అజ్ఞానులు అనుకోవచ్చు. అనుభవంలో తెలుసుకుకుంటేనే తత్వం బోధపడుతుందనేది నిత్య సత్యం ఇక్కడ ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టి అనంతపురం సత్యసాయి జిల్లాలలో సమాచార శాఖ లో చేసి అసత్యపు పనులు, అవినీతి, ప్రభుత్వ సొమ్మును ఏ విదంగా దుర్వినియోగం చేయవచ్చు ,అలాగే తనకు అధికారం ఉందని విధులు నిధులు ఏ విధంగా అప్పనంగా దోచుకుని దాచుకోవచ్చన్న విధానాన్ని కనిపెట్టిన అభినవ అంబెడ్కర్ నేటి చిత్తూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎన్ వేలాయుధం గురించి ప్రధానంగా చర్చించు కుంటే విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఏమిటయ్యా ఆ విస్తుపోయే నిజాలు అంటే ..ఆయన శ్రీసత్యసాయి జిల్లాలో వెలగబెట్టిన ఉద్యోగ ప్రస్తానం లో ఒక ప్రభుత్వ వాహనాన్ని తన నిర్లక్ష్యం, ఆశ్రద్ద,అవినీతి,ఆలసత్వం, లేక్కలేనితనం ,అధికార దర్పం,అహంకారం వెరసి కేవలం ఇరవై వేల రూపాయలు ఖర్చు చేస్తే చక్కగా తిరిగే స్వరాజ్డ్ మాజ్డా ఆరు చక్రాల వాహనాన్ని అభాసు పాలు చేసి ఆఖరికి ఆ వాహనం అత్యంత దయనీయ స్థితికి చేరుకునేలా చేసి ప్రబుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం తో పాటు అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించడాని అనడం లో ఎలాంటి సందేహం అక్కర్లేదని భావించాల్సి రావడం ఈ సమాచార శాఖ లో ఉన్న కొంతమంది అలసత్వపు అధికారుల నిర్లక్ష్యమని చెప్పాలి. ఆదియును కాక తన చేతిలో అధికారం ఉంటే ఆ అధికారాన్ని ఎన్ని విధాలుగా అడ్డగోలు తనానికి వాడుకోవచ్చన్న కొత్త అర్దాన్ని కనిపెట్టిన అబ్బినవ అవినీతి పరుడనే బిరుదును సమాచార శాఖ తరుపున ప్రదానం చేసిన తప్పేమీ కాదని అనవచ్చు. కారణం ఓకే ప్రాంతంలో ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టి అదే రాయలసీమ జిల్లాల్లో నే పరిభ్రమనం చెందుతూ ఏడీ డీడీ వరకు ఎడగడంతో అయన అవినీతి కి అడ్డుకట్ట వేసే వారు లేకపోవడం గమనార్హం వేలాయుధం ఉద్యోగ ప్రస్తానం లో జరిగిన అవినీతి ఆరోపణలపై సమాచార హక్కు చట్టం ద్వారా ఆ శాఖ అధికారులే ఇవ్వబడిన సమాచారం పరిశీలన చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ అని గొప్పగా చెప్పుకునే ఈ పాలకులు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి అతని లోపాలు పాపాలు.సాధారణంగా ఈ శాఖలో నైన ఒక వాహనం రిపేరు ఆ వాహనాన్ని నడిపే డ్రైవర్ గమనిస్తాడు.కానీ వేలాయుధం మాత్రం ఆయన ప్రయాణించే వాహనం బోలేరు రిపేరు ఆయనకు మాత్రమే తెలిసి వేల రూపాయలు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయి.అలానే డ్రైవర్ సిఫార్సు లేఖ లేకుండానే స్వరాజ్డ్ మాజ్డా వాహనం గత ఐదేళ్ళు గా ఒక ప్రవేటు షెడ్లు లో మూలన పడేయడం తో నేడు ఆ వాహనం అద్దె కు ఆ వాహనం వేలం వేసి అమ్మినా కూడా లెక్క సరిపోదన్నది స్థానిక మెకానికల్ వారి ద్వారా తెలియవస్తుంది. ఇవన్నీ ఆ జోన్ ను పర్యవేక్షణ చేసే ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు తెలియదా అంటే అన్ని తెలిసే జరిగాయన్నది నిజం.మరి ఎందుకు చర్యలు తీసుకోలేక పోయారంటే అందుకు భిన్నమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. జోన్ 4 కార్యాలయం మొత్తం మహిళా అధికారి చేతిలో కీలు బొమ్మ అయ్యిందన్న ఆరోపణలు అక్కడ గుప్పుమని వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రభుత్వ వాహనం మరమ్మతులకు వస్తే ఆ మరమ్మతుల కోసం జిల్లా కలెక్టర్ ను నిధులు మంజూరు చేయమని కోరడం సహజం. కానీ వేలాయుధం తన కున్న అధికార పరిధి దాటి ఏకంగా రోడ్ల భవనాల శాఖా మంత్రి కి,జిల్లా పరిషత్ చైర్మన్ కు వాహనం మరమ్మతుల కోసం నిధులు కావాలని అధికారిక లేఖ రాయడం ఆ శాఖలో ఉన్న కొంతమంది పై స్థాయి అధికారులు అచ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు తన కింది స్థాయి ఉద్యోగుల తో వసూళ్లు చేసి అటు వాహనం రిపేరు చేయక ఇటు తిరిగి డబ్బులు చెల్లించక పోవడం పలు ఫిర్యాదులు లేవనెత్తడం విచారణ జరిపించగా అన్ని వాస్తవాలు గా ధ్రువీకరణ చేస్తూ ఫోన్ పే స్క్రీన్ షార్ట్స్ కూడా ఇచ్చినా జోన్4 ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నిమ్మ్మకు నీరెత్తినట్లు వ్యవహారం చేశారన్న ఆరోపణలకు బలం చేకూర్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇన్నీ జరుగుతున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడ్డదారిలో కోర్టు మెట్లక్కి అడిషనల్ డైరెక్టర్ ఇంచార్జ్ గా ఉన్న జోన్ 2 ఆర్జెడీ స్వర్ణలత కు నాటి డైనమిక్ డైరెక్టర్ హిమాన్స్ శుక్లా ఈ అవినీతి తిమింగలం పై విచారణ చేయమని ఆదేశించినా ఆయన ఆదేశాలు అడిషనల్ డైరెక్టర్ ఛాంబర్ దాటాక కుండా చేసుకుని కాలాన్ని వెళ్లబుచ్చి కలిసివచ్చిన కాడికి నోట్ల కట్టలు దోచుకుని దాచుకుని నిస్సిగ్గుగా సన్మానాలు చేయించుకుని ఇక సెలవంటూ సమాచార శాఖను వదిలి పెట్టి పోయింది. ఇలా వేలాయుధం అవినీతి అక్రమాలపై ఉమ్మడి అనంతపురం పబ్లిషర్స్ అలుపెరగని పోరాటం చేస్తున్నా అవినీతి నిలయంగా మార్చిన కొంతమంది ఉన్నతాధికారుల వలన వేలాయుధం కులమనే ఆయుధం తో తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించు కుంటూ పోతు అనతి కాలంలో జోన్ 4 ఆర్జేడీ గా వస్తానని అప్పుడు అందరి కథలు తెలుస్తానంటూ అటు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగిన కింది స్థాయి అధికారులను అటు ఆయా జిల్లాల పుబ్లిషర్స్ ను నర్మ గర్భం గా బెదిరింపులు చేస్తూ వేలాయుధం తన ఆయుధాలను ఉపయోగిస్తున్నాడన్న ఆరోపణలు గుప్పు మంటున్నాయి. ఇక మరో ముఖ్యమైన విషయానికి వస్తే ఒక ప్రభుత్వ అధికారి అధికారిక ఫోన్ నుండి సభ్యసమాజం సిగ్గుతొ తల దించుకునెలా అస్లీల వీడియోలు అధికారిక గ్రూప్ లలో వస్తే ఆవి ఎలా ఎప్పుడు ఎందుకు ఎక్కడి నుంచి ఏమిటి కి వచ్చాయన్న ప్రాథమిక నిర్దారణ కూడా జరగకుండా సైబర్ క్రైం పోలీసులతోనే క్రైం చేయించి ఓ మూడు లక్షల రూపాయల తో ఆ అస్లీలం కాస్తా అడ్రెస్ లేకుండా వేలాయుధం చేయించారన్న ఆరోపణలు అప్పటి ఉండి ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో పాటు జోన్ 4 కోడై కూస్తుందని ఇదంతా సమాచార శాఖ కమిషనరేట్ పరిధిలో కూడా తెలిసినా పట్టి పట్టనట్లు అంటి అంట నట్లు ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరి ఇలాంటి అధికారిపై చర్యలు తీసుకునే వారు ఉన్నారా లేదా అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి మరి