తాజా వార్తలుకుళ్లు రాజకీయాలు మానుకోవాలి

కుళ్లు రాజకీయాలు మానుకోవాలి

సిరిసిల్లలోని వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని గురువారం పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుళ్లు రాజకీయాలు మానుకోవాలని..తమ అహంకారమే బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమైందని అన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా ఇంకా ప్రమాణ స్వీకారం చేయడం లేదని … కాంగ్రెస్‌పై విమర్శలు చేసేందుకు కేటీఆర్‌కు బుద్దుందా అని ప్రశ్నించారు.అధికారం లేకుండా కేటీఆర్‌ ఉండలేకపోతున్నారు.. అందుకే విధ్వంస రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.సీతక్క ఆయన హితవు పలికారు.
‘ప్రజలు మావైపే ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే జీర్ణించు కోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారు. సర్పంచుల వేల బిల్లులు పెండింగ్ పెట్టింది గత ప్రభుత్వం కాదా..? మేము సక్రమంగా పని చేస్తేనే మళ్ళీ అధికారం ఇస్తారు. చేయకపోతే అవకాశం ఇవ్వరు. కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చేస్తే ప్రజలు గుర్తిస్తారు. లేదంటే మిమ్మల్ని ఎప్పటికీ ప్రజలు తిరస్కరిస్తూనే ఉంటారు.
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రాజన్న ఆలయం అభివృద్ధిలో వివక్షకు గురైంది. మా ప్రభుత్వంలో తప్పకుండా అభివృద్ధి చేస్తాం.’ అని సీతక్క పేర్కొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article