తాజా వార్తలుఆలయం వద్దే భిక్షాటన..ఆలయ అభివృద్ధికి సాయం

ఆలయం వద్దే భిక్షాటన..ఆలయ అభివృద్ధికి సాయం

ముత్యాలపాడు సాయిబాబా మందిరానికి లక్ష రూపాయల విరాళమిచ్చిన యాచకుడు

ఇప్పటి వరకు రూ. 8.54 లక్షల విరాళం అందించిన యాదిరెడ్డి

విజయవాడ ముత్యాలపాడులోని సాయిబాబా మందిరానికి ఓ యాచకుడు లక్ష రూపాయల విరాళం ఇచ్చాడు. ఆలయం వద్ద బిచ్చమెత్తుకుని జీవించే యాదిరెడ్డి మందిర అభివృద్ధికి తనవంతు సాయంలో భాగంగా ఈ విరాళం ఇచ్చారు. మందిరం గౌరవాధ్యక్షుడు గౌతమ్‌రెడ్డికి నిన్న ఆ సొమ్ము అందించాడు.ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ సంపాదించే సొమ్మును తిరిగి స్వామికే ఇవ్వడం ఆనందంగా ఉందని, ఇకపైనా ప్రతీ రూపాయి దైవ కార్యానికే అందిస్తానని ఈ సందర్భంగా యాదిరెడ్డి తెలిపారు. తన జీవితం బాబా సేవకే అంకితమన్న ఆయన ఆలయ అభివృద్ధికి ఇప్పటి వరకు రూ. 8.54 లక్షల విరాళం ఇవ్వడం గమనార్హం.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article