తాజా వార్తలువిశాఖపట్టణం జిల్లాలో తహసీల్దార్ దారుణ హత్య

విశాఖపట్టణం జిల్లాలో తహసీల్దార్ దారుణ హత్య

విశాఖపట్టణం జిల్లాలో ఓ తహసీల్దార్ దారుణహత్యకు గురయ్యారు. జిల్లాలోని చినగదిలి రూరల్ తహసీల్దార్‌ సనపల రమణయ్యను ఆయన నివాసం వద్దే దుండగులు హత్య చేశారు. కొమ్మాదిలోని ఆయన నివసించే అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్న దుండగులు ఇనుప రాడ్డుతో ఆయన తలపై దాడిచేశారు.తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article