ప్రజాభూమి ప్రతినిధి విజయవాడ
రాష్ట్ర ప్రజలకు సూర్య భగవానుడి కృపా కటాక్షం ఉండాలని పూజలు చేయడం జరిగిందని శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ నిర్వాహకుడు కె. రవికుమార్ వరలక్ష్మి దంపతులు అన్నారు.స్థానిక64వ డివిజన్ కండ్రికలో 8వ సంవత్సర శ్రీ లక్ష్మీగణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవములు ఘనంగా నిర్వహిస్తున్నారు.వినాయక చవితి నవరాత్రులు 7వ రోజు ఆదివారంశ్రీలక్ష్మి గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ నిర్వాహకుడురవికుమార్ వరలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ కమిటీ నిర్వాహకుడు కె. రవికుమార్ వరలక్ష్మి దంపతులు, టీమ్ సభ్యులు కలసి గణపతి విగ్రహానికి పూజలు నిర్వహించారు.శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి చవితి నవరాత్రి ఉత్సవములు శ్రీ లక్ష్మీగణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.ప్రతిరోజుభక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని కమిటీ సభ్యులను మరో ముఖ్య అతిధి
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు అన్నారు.రాత్రికి పందిరిలో భరత నాట్యం, మ్యాజిక్ షో ఉంటుందని ఈకార్యక్రమంలో శ్రీలక్ష్మి దేవి ఫ్రెండ్స్ సర్కిల్ నిర్వాహకుడు కె. రవికుమార్ వరలక్ష్మి దంపతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నవనీతం సాంబశివరావు,అల్లు మహేష్, పొలిశెట్టి చంద్ర శేఖర్, పల్లెల రవి, అల్లు నరేంద్ర,తోట సత్యనారాయణ,తోట వెంకట ప్రసాద్,పట్టేం శెట్టి నాగమణి,ఇ.హరికృష్ణ రెడ్డి,కె. హర్ష సాయి, కోమరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

