తాజా వార్తలుఇంద్రకీలాద్రిపై భక్తులను అలరించిన ‘కూచిపూడి నృత్య ప్రదర్శన’

ఇంద్రకీలాద్రిపై భక్తులను అలరించిన ‘కూచిపూడి నృత్య ప్రదర్శన’

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ధర్మపథం” కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.విజయవాడకు చెందిన రూపజ్యోతి కళా బృందం సాయంత్రం 6:30 గంటల నుండి ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య రూపకాలు, ముద్రలు మరియు భావయుక్తమైన అభినయాలు అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తజనాన్ని మంత్రముగ్ధులను చేశాయి.

​ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శించిన పలు దివ్య స్తోత్రాలు, కీర్తనల నృత్య అంశాలు విశేష ప్రశంసలు పొందాయి.ప్రదర్శన అనంతరం కళాబృందాన్ని ఆలయ అధికారులు ఘనంగా అభినందించారు. ఆలయ మర్యాదల ప్రకారం శ్రీ అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి సత్కరించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article