- 10 రోజులుగా నీటి కోసం ప్రజల అవస్థలు
- అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం
ప్రజాభూమి ప్రతినిధి, తాళ్లపూడి
తాళ్లపూడి మండలం అన్నదేవరపేట పంచాయతీ పరిధిలోని సూరయ్యపేట గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. గత పది రోజులుగా తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంచాయతీ అధికారులు రెండు రోజులకోసారి ఒక ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. అయితే గ్రామ అవసరాలకు సరిపడా నీరు అందకపోవడంతో ట్యాంకర్ వద్ద నీటి కోసం ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు.
ముఖ్యంగా వృద్ధులు, మహిళలు తాగునీటి కోసం బిందెలతో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నీటి కోసం ప్రజలు ఒకేసారి ట్యాంకర్ వద్దకు చేరుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.
సూరయ్యపేటలో తాగునీటి సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. అప్పటివరకు ప్రతిరోజూ ట్యాంకర్ల ద్వారా సరిపడా తాగునీటిని సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సూరయ్యపేట ప్రజల తాగునీటి కష్టాలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
దీనిపై కార్యదర్శి శ్రీనివాస్ ను వివరణ కొరగా సూర్యాపేటలో నీటి కొరత తీర్చడానికి రోజుకు నాలుగు ట్యాంకులు పంపుతున్నామని అవసరమైతే అదనంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. త్వరలో ఆ ఏరియాలో జియాలజీ అధికారులు వాటర్ పడే ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కారానికి కై బోరును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

