*మధుసూదన్ ఆశలు చిగురిస్తాయా..
*అడిషనల్ డైరెక్టర్ కుర్చీ అసలపల్లకిలోనా..అంపసయ్యపైననా..!
*ఎవరిదిఆశలపల్లకి…ఎవరిది అంపసయ్య…
*ఇప్పటికీ పల్లకీలో పీఆర్ దే..
*కొత్తగా పల్లకి ఇంజినీరింగ్ ఎక్కగలదా…
*2008 సడలింపు కు ప్రభుత్వం నో చెప్పినా…
*2016 నుంచి సర్వీస్ రెగులర్ అప్పీలు…
*పీఆర్ వింగ్ కుఇచ్చిన నాటి సడలింపు నేడు వర్తిస్తుందా..
*నాడేందుకు ఇంజినీరింగ్ విభాగం మౌనంగా ఉంది..
*నేడేందుకు ప్రస్తావన తెస్తుంది…
*అడిషనల్ డైరెక్టర్ కోసం అంత జగడమేల..
*రెండు జేడీ పోస్టులు సరెండర్ తో అడిషనల్ డైరెక్టర్ పోస్టు ఏర్పడింది..
*రెండు డార్క్ రూమ్ పోస్టు లు సరెండర్ తో చీఫ్ ఫోటో గ్రాఫర్ పోస్టు పుట్టింది…
*ఇక్కడ త్యాగం పీఆర్ దా. ఇంజినీరింగ్ దా…
*ఆనాడు.. ఈనాడు ప్రభుత్వానిదేగా నిర్ణయం…
*అదే నిర్ణయం ఇప్పుడు ఎవరికి మేలు.. ఎవరికి కీడు….
*పీఆర్ వెర్సెస్ ఇంజినీరింగ్ లో ఎవరిది త్యాగం…ఎవరిది ఖేదం…
*మంత్రి గారి సిఫార్సు జీవో లనే మార్చుతుందా..
*నిబంధనలకు విరుద్ధంగా సడలింపు ఉంటుందా…
*ఈ కుర్చీలాట కథ ముగింపెన్నడు…!
(రామమోహన్ రెడ్డి)
సమాచార శాఖ లో ప్రస్తుతం చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న అడిషనల్ డైరెక్టర్ కుర్చీలాట రసవత్తరంగా సాగుతోందని చెప్పాలి. ముఖ్యంగా పీఆర్ వింగ్ వర్సెస్ ఇంజినీరింగ్ విభాగాల మధ్య ఆధిపత్య పోరు ముఖ్యమంత్రి కార్యాలయ పరిధిలో జరుగుతుంది. ఇక్కడ ఎవరు సీనియారిటీ విషయంలో ఎవరికివారు తమదేనని ఆశల పల్లకీలో ఊగుతున్నారు అయితే ఎవరిది అసలు పల్లకి అవుతుంది ఎవరిది అంపసయ్యపై ఉంటారన్నది ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది.ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి పరిశీలన చేస్తే అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ప్రస్తుతం పీఆర్ వింగ్ తరువున సీనియర్ జాయింట్ డైరెక్టర్ తేళ్ల కస్తూరి ఇంజినీరింగ్ తరుపున చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర ఓ మధుసూదన అడిషనల్ డైరెక్టర్ కుర్చీ కోసం కర్చీఫ్ వేసి ఉంచారు.అయితే సమాచార శాఖ ఏర్పడిన తొలినాళ్ళ నుంచి పీఆర్ వింగ్ వారిదే సర్వం అన్నట్లుగా కొనసాగుతూ వస్తోంది.మెజార్టీ జర్నలిస్ట్ వర్గాల్లో కూడా పీఆర్ వింగ్ తోనే సత్సంబంధాలు కలిగి ఉంటాయి.వాస్తవానికి కొద్ది మందికి మాత్రమే ఇంజినీరింగ్ విభాగం గురించి అవగాహన కలిగి ఉండటం సహజం. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఇంజినీరింగ్ విభాగం వారు రాష్ట్ర విభజన తరువాత అడిషనల్ డైరెక్టర్ సీటు కోసం పోటీలో ఉండడంతో ఇప్పుడు ఎవరు అర్హులు ఎవరి సీనియారిటీ ప్రభుత్వం గుర్తిస్తుంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ మొదటి నుండి కూడా పీఆర్ వింగ్ వారు మాత్రమే అడిషనల్ డైరెక్టర్ పోస్టులో కొనసాగుతూ ఉన్నారు.పీఆర్ వింగ్ విభాగం వారు రెండు జాయింట్ డైరెక్టర్ పోస్టులు ప్రభుత్వానికి సరెండర్ చేస్తే అడిషనల్ డైరెక్టర్ పోస్టు క్రియేట్ అయిందని రెండు డార్క్ రూమ్ పోస్టులు సరెండర్ చేస్తే చీఫ్ ఫోటోగ్రాఫర్ పోస్ట్ క్రియేట్ అయిందనేది ఇంజినీరింగ్ విభాగం వారికి తెలిసిందే.సదరు చీఫ్ ఇంజనీర్ పోస్టు సృష్టించబడటానికి ఎలాంటి పోస్టులు కూడా సరెండర్ చేయలేదు. పోస్టు క్రియేషన్ కి సంబంధించిన జీవో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మాత్రమే ఇచ్చింది ఐఎన్పిఆర్ దానికి సంబంధించిన జీవో జారీ చేయలేదు.అయినప్పటికీ మొదటి నుండి పీఆర్ వింగ్ చూస్తున్న అడిషనల్ డైరెక్టర్ బాధ్యత ఇప్పుడు ఇంజినీరింగ్ విభాగం కోరుకోవడం లోనే అసలు సమస్య ఏర్పడుతుంది.అయితే ఇక్కడ ఇరుపక్షాల వాదనలు విభిన్నంగా ఉన్నాయి.ఇందులో ఏది నిజం ఏది అబద్దం అన్నది ప్రబుత్వమే నిర్ణయించాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీనియారిటీ ప్రకారం 2008 లో ప్రస్తుత చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ గా ఓ మధుసూదన తన సీనియారిటీ కోసం ప్రస్తుత తెలంగాణ డైరెక్టర్ గా ఉన్న కిషోర్ బాబు తో పోటీ పడి కోర్టు ను ఆశ్రయించడం తో కోర్టు ఉత్తర్వుల మేరకు మధుసూదన కు ప్రమోషన్ ఇవ్వాలని కోర్టు డైరెక్సన్ ఇవ్వడంతో ఆనాటి ప్రభుత్వం కండిషనల్ అనే పదం జోడించి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ గా కేటాయింపు జరిగినట్లు ఆ విషయం ప్రభుత్వం నోట్ ఫైల్ లో సూచించినట్లు గా అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ సీనియారిటీ ని దృష్టిలో ఉంచుకుని అడిషనల్ డైరెక్టర్ పోస్ట్ కు అర్హత తనకే ఉందని సిఐ ఈ మధుసూదన ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం
ఒకే మంజూరు పోస్టుకు 2008లో ఇద్దరు అధికారులను ఎలా ప్రమోట్ చేశారు..?రెగ్యులర్ పోస్టు లేకపోయినా 2008 నుంచే సేవలను రెగ్యులరైజ్ చేయవచ్చా..?
డిప్యుటేషన్లో గడిపిన కాలాన్ని రెగ్యులర్ సర్వీసుగా పరిగణించవచ్చా..?అన్న కోణంలో ఆ ఫైల్ తిరస్కరించినట్లు తెలుస్తుంది.1993 నాటి జీఓ(పి) నెం.10 ప్రకారం ప్రొబేషన్ పూర్తి కాకముందు డిప్యుటేషన్‌కు పంపకూడదని నిబంధనలు డిప్యుటేషన్లో గడిపిన సేవను ప్రొబేషన్ కోసం లెక్కించాలంటే ప్రత్యేక సడలింపు అవసరమని ఇదే అంశాన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కూడా ప్రస్తావించిరాష్ట్ర విభజన తర్వాత చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ పోస్టు తెలంగాణకు కేటాయించబడగా, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పోస్టు 31 అక్టోబర్ 2016న మాత్రమే సృష్టించబడింది. మధుసూదన్ 10 నవంబర్ 2016న ఆ పోస్టులో చేరారు.అయితే పోస్టు లేని కాలంలో 2008 నుంచి రెగ్యులర్ సర్వీసుగా ఎలా పరిగణించాలన్న ప్రశ్నఇదే సమయంలో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ పోస్టు అదనపు డైరెక్టర్ పోస్టుకు ఫీడర్ కేటగిరీ అని పేర్కొంటూ ఉమ్మడి సీనియారిటీ జాబితా రూపొందించాలని ఆదేశించింది. డివిజన్ బెంచ్ కూడా ఈ తీర్పును సమర్థించింది.ఉమ్మడి సీనియారిటీని ఆశించిన మధుసూదన్‌కు న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వడం ప్రభుత్వం కూడా ఆ ఫైల్ ను రిజెక్ట్ చేసి నట్లు తెలుస్తోంది. అయితే తన సర్వీస్ 2016 నుంచి
రెగ్యులర్ చేయాలనే పునః ప్రతిపాదన తీసుకొచ్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.లా డిపార్ట్మెంట్ అభిప్రాయం ప్రకారం, అమల్లో ఉన్న నిబంధనలను కచ్చితంగా వర్తింపజేస్తే 2008లో జరిగిన పదోన్నతిని పూర్తిస్థాయి రెగ్యులర్ ప్రమోషన్‌గా పరిగణించడం క్లిష్టమవుతుందని తెలుస్తోంది. 2016 వరకు సంబంధిత మంజూరైన పోస్టు అందుబాటులో లేకపోవడం, సీనియారిటీ అంశాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉండటం, గత సర్వీసును రెగ్యులరైజ్ చేయాలంటే ప్రత్యేక సడలింపు అవసరం కావడం వంటి అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.ఉమ్మడి సీనియారిటీ జాబితా ఆధారంగా ప్రమోషన్లను పునఃసమీక్షిస్తే ప్రస్తుతం ఉన్న హోదాలు, పదోన్నతి క్రమంపై ప్రభావం పడే అవకాశం ఉందని శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రబుత్వం 2008 సీనియారిటీ చెల్లదని సూచించగా 2006 లో జీవో 81 ప్రకారం ఒక పోస్టు కు 12 మంది డిప్యుటేషన్ లో ఉన్నవారికి డీడీ లుగా ప్రమోషన్ ఇచ్చారనే అంశాన్ని తెరమీదకి తెస్తూ అలానే ఇంజినీరింగ్ కు డిప్యుటేషన్ పీరియడ్ ని రేగులరైజ్ చేయాలనే ప్రతిపాదన చేస్తూ అలా వీలు కానీ పక్షములో 2016 నుంచి సర్వీసు ను పరిగణనలోకి తీసుకుని అడిషనల్ డైరెక్టర్ గా అవకాశం కల్పించాలని సంబంధిత శాఖ మంత్రి సిఫార్స్ కోసం ఇంజినీరింగ్ విభాగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.పరిపాలన పూర్తిగా పీఆర్ వింగ్ చేతిలో ఉండటం మూలాన ఇంజినీరింగ్ విభాగం పై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ తమ విభాగాన్ని పూర్తిగా తొక్కి వేసినట్లు ఆరోపిస్తున్నారు.. అందుకే అడిషనల్ డైరెక్టర్ పోస్ట్ గత నాలుగు సంవత్సరాలు పైబడి ఎఫ్ ఏ సీ లోనే కొనసాగిస్తున్నారనే కొత్త వాదం ఇంజినీరింగ్ వైపు నుండి వినిపిస్తున్నారు. అయితే
పీఆర్ వింగ్ ఇందుకు భిన్నంగా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కేవలం 60మంది ఇంజినీరింగ్ వారు ఉంటే 1200 మంది తో ప్రభుత్వం తో అనుసరించి ఉంటుందని చెప్పుకు వస్తున్నారు .తమకు మెజార్టీ సిబ్బంది అన్న విలువ కూడా ఇవ్వరా అని ఆవేదన చెందుతున్నారు పీఆర్ వింగ్ వారు .261 జీవో ప్రకారం తమది కేటగిరి రెండు వారి కేటగిరి మూడు అని డైరెక్టర్ క్యాటగిరి వన్ అవుతారని అలాగే అడిషనల్ డైరెక్టర్ కేటగిరి 1ఏ ఉంటుంది ఆ జీవో చెబుతుందని
పి ఆర్ వింగ్ లో అటెండర్ కూడా డైరెక్టర్ కావచ్చు కానీ వారి ఇంజనీరింగ్ శాఖలో ఒక అటెండర్ కనీసం aie కూడా కాలేడనే వాదం వినిపిస్తున్నారు.అలాగే
2016 నుంచి సీనియారిటీ పరిగణనలోకి తీసుకుంటే 2008 పొందిన ఆర్థిక ప్రయోజనాలు , గతంలో పదోన్నతుల ద్వారా పొందిన వేతన వ్యత్యాసాలు, ఇతర సర్వీస్ ప్రయోజనాల అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత కాలంలో పొందిన ఆర్థిక లబ్ధిని తిరిగి ప్రభుత్వానికి నగదు రూపంలో చెల్లించాల్సి వస్తుందా అనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.దీనికి తోడు 2006 లో పీఆర్ వింగ్ లో ఇచ్చిన డిప్యుటేషన్ సడలింపు అనేది ముగిసిన అధ్యాయమని దాదాపు 20 సంవత్సరాల తరువాత ఆ అంశానికి ముడిపెట్టడం సరైనది కాదని అయినప్పటికీ ఆనాడు జీతభత్యాలు పీఆర్ వింగ్ కంటే ఎక్కువని మౌనంగా ఉండి నేడు అధికారం కావాలనే దురాశతో పీఆర్ వింగ్ పై అనవసర రాద్ధాంతం చేయడం సరైనది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.2006లో డిప్యూటేషన్ లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు అని చెప్తున్నారు కదా. పదవీ విరమణ దగ్గరగా ఉన్నవారు కొద్దీ పాటి సడలింపు ఉంటాయని . ఐ అండ్ పీఆర్ హిస్టరీలో 31వ తారీఖున ప్రమోషన్ తీసుకొని అదేరోజు రిటైర్ అయిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారని పీఆర్ వింగ్ వ్యక్తం చేస్తున్నారు.ఇన్ని రకాల పరిణామాల నేపథ్యంలో పీఆర్ వెర్సెస్ ఇంజినీరింగ్ పోరులో అడిషనల్ డైరెక్టర్ కుర్చీ ఎవరు అధిష్టారన్న ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

