సాహిత్యంసూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీ క‌ల్యాణ వెంకన్న..!

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీ క‌ల్యాణ వెంకన్న..!

చంద్రగిరి:శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణవేంకటేశ్వర
స్వామివారిబ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై శ్రీరామ కృష్ణ గోవింద అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సూర్యప్రభ వాహనంపై శ్రీ సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు,సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం భక్తులలో విశ్వాసం. అనంతరంఉదయం 10.30 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్స‌వ‌ర్ల‌కు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేపట్టారు.ఈవాహనసేవలో జేఈవో వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ వెంక‌ట‌స్వామి, ఆల‌య అర్చ‌కులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article