క్రీడలున్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో శ్రీలంక విజ‌యం

న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో శ్రీలంక విజ‌యం

గాలె: న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో శ్రీలంక విజ‌యం సాధించింది. 63 ర‌న్స్ తేడాతో గాలె టెస్టులో విక్ట‌రీ కొట్టింది. లంక స్పిన్న‌ర్ ప్ర‌భాత్ జ‌య‌సూర్య రెండో ఇన్నింగ్స్‌లో కీల‌క‌మైన అయిదు వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బ‌తీశాడు. 275 ర‌న్స్ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్‌.. కేవ‌లం 211 ర‌న్స్‌కు ఆలౌటైంది. ఇవాళ అయిదో రోజు ఆట ఆరంభ‌మైన 15 నిమిషాల్లోనే చివ‌రి రెండు వికెట్ల‌ను న్యూజిలాండ్ కోల్పోయింది. ర‌చిన్ ర‌వీంద్ర ఒంట‌రి పోరాటం చేసి 92 ర‌న్స్ చేశాడు. సుడులు తిరుగుతున్న గాలె పిచ్‌పై కివీస్ బ్యాట‌ర్లు ప‌రుగులు రాబ‌ట్ట‌డంలో త‌డ‌బ‌డ్డారు. ఇదే పిచ్‌పై గురువారం రెండో టెస్టు ప్రారంభంకానున్న‌ది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article