సినిమా‘త్రినయని’ నటి పవిత్ర జయరామ్ భర్త ఆత్మహత్య?

‘త్రినయని’ నటి పవిత్ర జయరామ్ భర్త ఆత్మహత్య?

ఇటీవల ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర జయరామ్.. కారు యాక్సిడెంట్‌లో మరణించింది. ఆ ఘటన మరవకముందే తన భర్త చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మణికొండలో తన ఇంట్లో చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకొని మరణించినట్లు సమాచారం. ఈ విషయం బయటికి రాగానే ఒక్కసారి బుల్లితెర అంతా ఉలిక్కిపడింది. పవిత్ర జయరామ్ మరణాన్ని తట్టుకోలేక చంద్రకాంత్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని అంటున్నారు. పవిత్ర మరణించిన రోజు నుంచి చంద్రకాంత్ తన బాధను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉన్నాడు. చివరిగా తను లేని జీవితం వద్దని తను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అంటున్నారు. అయితే, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.దాదాపు అయిదు రోజుల క్రితం ఒక కారు యాక్సిడెంట్ వల్ల సీరియల్ నటి పవిత్ర జయరామ్ చనిపోవడం బుల్లితెరపై కలకలం సృష్టించింది. తనకు క్లోజ్ అయిన బుల్లితెర నటీనటులు అంతా పవిత్ర మృతిని జీర్ణించుకోలేకపోయారు. తన భర్త చంద్రకాంత్ కూడా పవిత్ర మరణించింది అనే నిజాన్ని నమ్మలేకపోయాడు. చంద్రకాంత్ కూడా యాక్సిడెంట్ సమయంలో పవిత్రతో పాటు కారులో ఉన్నాడు. కానీ తనకు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత అసలు వారి కారుకు యాక్సిడెంట్ ఎలా జరిగింది, పవిత్ర ఎలా మరణించింది లాంటి వివరాలను బయటపెట్టాడు. అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు పవిత్ర లేదని బాధతో పోస్టులు పెడుతూనే ఉన్నాడు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article