తాజా వార్తలుతిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

సూర్యప్రభ వాహనంపై శ్రీవారి ఊరేగింపు
ఉదయం 5:30 గంటలకు వాహనసేవ

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవం కోసం దాదాపు 7 టన్నుల పుష్పాలను, 50 వేల కట్ ఫ్లవర్స్ ను ఉపయోగించి మహాద్వారం నుంచి స్వామి వారి సన్నిధి వరకు పుష్పాలంకరణ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి వాహనసేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనంపై అర్చకులు శ్రీవారిని ఊరేగించారు.

ఉదయం 11 గంటల ప్రాంతంలో చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 గంట తర్వాత గరుడ వాహనం, మధ్యాహ్నం 2- 3 గంటల మధ్య హనుమంత వాహనంపై స్వామివారిని ఊరేగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article