తాజా వార్తలుపవన్ కల్యాణ్ తిరుమల టూర్ షెడ్యూల్ లో మార్పులు

పవన్ కల్యాణ్ తిరుమల టూర్ షెడ్యూల్ లో మార్పులు

ఎపి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల టూర్ షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీకి బదులు ఒకటో తేదీన తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఒకటో తేదీన అలిపిరి నుంచి కాలిబాటలో కొండపైకి వెళతారు. ఇక అక్టోబర్‌ 2వ తేదీ తిరుమల అన్న ప్రసాద వితరణను పరిశీలిన, ప్రాయశ్చిత దీక్ష విరమణ ఉంటుంది. 3న శ్రీవారి దర్శనం, తిరుపతిలో వారాహి సభ ఉంటుంది.
ఇక దీనిపై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, వారాహి సభను విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అక్టోబర్ 1 వ తేది ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆలయాలు, యోగ కేంద్రాల్లో నిర్వహించాలని అక్టోబర్ 2వ తేది నగర సంకీర్తన ఉంటుందని తెలిపారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article