సినిమా‘విశ్వంభ‌ర‌’.. టీమ్లో మార్పు

‘విశ్వంభ‌ర‌’.. టీమ్లో మార్పు

చిరంజీవి – వశిష్ట కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘విశ్వంభ‌ర‌’. త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ భారీ బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమా టీమ్‌లో ఓ కీల‌క‌మైన మార్పు చోటు చేసుకొంది. ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు అందిస్తున్న బుర్రా సాయిమాధ‌వ్ టీమ్ నుంచి త‌ప్పుకొన్నారు. ఆయ‌న స్థానంలో మ‌రో ర‌చ‌యిత టీమ్‌లో చేరారు. ఆయ‌న ఎవ‌ర‌న్న‌ది తేలాల్సివుంది. ఇప్ప‌టికే కొంత‌మేర షూటింగ్ సాగింది. కొన్ని స‌న్నివేశాల్ని బుర్రా సాయిమాధ‌వ్ రాశారు కూడా. 2025 సంక్రాంతికి ‘విశ్వంభ‌ర‌’ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article