క్రీడలుభారత స్టార్లను బెంబేలెత్తించిన హసన్ మహమూద్

భారత స్టార్లను బెంబేలెత్తించిన హసన్ మహమూద్

జట్టు కోల్పోయిన నాలుగు వికెట్లు అతడి ఖాతాలోకే

బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత జట్టుకు బంగ్లాదేశ్‌ పేసర్ హసన్ మహమూద్ కష్టాలు తెచ్చిపెట్టాడు. భారత టాప్ ఆర్డర్ విఫలమవడంతో 96 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్‌శర్మ (6), శుభమన్ గిల్ (0), విరాట్ కోహ్లీ (6) వంటి స్టార్ బ్యాటర్లు భారీ స్కోరు చేయకుండానే ఔటయ్యారు.ఒక్క రిషభ్ పంత్ (39) మాత్రమే కాసేపు క్రీజులో నిలదొక్కుకున్నాడు, కానీ అతను కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ప్రస్తుతం, ఓపెనర్ యశస్వి జైస్వాల్ (43) మరియు కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది.భారత్ ఈ దశలో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుని స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article