తాజా వార్తలుభార‌త్ లో బ్రెయిన్ ఈటింగ్ డిసీజ్ ఎంట‌ర్

భార‌త్ లో బ్రెయిన్ ఈటింగ్ డిసీజ్ ఎంట‌ర్

భారత్‌లో బ్రెయిన్‌ ఈటింగ్‌ డిసీజ్‌ కలకలం రేగింది. మెదడును తినే అమీబా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. తాజాగా ఈ వ్యాధి సోకిన కేరళలోని కోజికోడ్‌కు చెందిన 14 ఏళ్ల మృదుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఒక చిన్నపాటి చెరువులో స్నానానికి దిగిన అనంతరం అతనికి ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధిని అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పీఏఎం)అని పిలుస్తారు. ఈ వ్యాధి నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా వల్ల వస్తుంది. ఈ అమీబా నీటి ద్వారా శరీరంలోకి చేరినప్పుడు, నాలుగు రోజుల్లోనే అది మానవ నాడీ వ్యవస్థపై అంటే మెదడుపై దాడి చేస్తుంది. 14 రోజుల వ్యవధిలో ఇది మెదడులో వాపుకు కారణమవుతుంది. ఫలితంగా బాధితుడు మరణిస్తాడు. ఈ ఏడాది కేరళలో ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ ముగ్గురు మరణించారు.దీనికి ముందు కూడా మన దేశంలోని వివిధ ఆసుపత్రులలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్‌పీ) తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి బారినపడి కేరళ, హర్యానా, చండీగఢ్‌లలో ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు.అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ నివారణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరూ కూడా మురికి నీటి ప్రదేశాల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరినేషన్ తప్పని సరి చేయాలని, చిన్నారులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున వారు నీటి వనరులలోకి ప్రవేశించినప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్విమ్మింగ్ చేసే సమయంలో నోస్ క్లిప్‌లను ఉపయోగించడం వల్ల ఈ ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article