సినిమాచిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ తేజ్‌కు తొలి చిత్రంగా “చిరుత” విడుదలై, 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ చిత్రం 2007లో విడుదలై, రామ్ చరణ్‌ను సినీ ప్రపంచానికి పరిచయం చేసింది. భారీ అంచనాలతో విడుదలైన “చిరుత” బాక్సాఫీస్‌ను కుదిపేసి, రామ్ చరణ్ విజయవంతమైన సినీ ప్రయాణానికి బాటవేసింది.ఈ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, రామ్ చరణ్ అభిమానులు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో కేక్ కటింగ్, వయోవృద్ధులకు పండ్లు, ఫలహారాలు అందించడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరికొందరు ఆయన అభిమానులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారు.వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా నేహా శర్మ నటించగా, ప్రకాష్ రాజ్, ఎం.ఎస్. నారాయణ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. “చిరుత” రామ్ చరణ్‌కు కేవలం హీరోగా మాత్రమే కాకుండా, గ్లోబల్ స్టార్‌గా ఎదగడంలో కూడా ప్రథమ అడుగు వేసిన చిత్రం.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article