Monday, April 20, 2026

Creating liberating content

తాజా వార్తలుఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 50 లక్షలు.. కేఏ పాల్‌పై చీటింగ్ కేసు

ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 50 లక్షలు.. కేఏ పాల్‌పై చీటింగ్ కేసు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ రూ. 50 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతేడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పాల్ తనకు ఎల్బీనగర్ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి తన నుంచి రూ. 50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. రూ. 30 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించగా, మిగతా రూ. 20 లక్షలు పలు దఫాలుగా పాల్‌కు నేరుగా చెల్లించినట్టు తెలిపారు.డబ్బులు తీసుకున్నప్పటికీ తనకు టికెట్ మాత్రం ఇవ్వలేదని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article