తాజా వార్తలు122 మంది ఉద్యోగుల‌ను తెలంగాణ‌కు రిలీవ్ చేసిన ఏపీ ప్ర‌భుత్వం

122 మంది ఉద్యోగుల‌ను తెలంగాణ‌కు రిలీవ్ చేసిన ఏపీ ప్ర‌భుత్వం

తెలంగాణ స్థానిక‌త ఉన్న 122 మంది ఉద్యోగుల‌ను రిలీవ్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్ర‌భుత్వం అభ్య‌ర్థ‌న మేర‌కు ఏపీ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఇక‌పై తెలంగాణ‌లో ప‌ని చేయ‌నున్నారు. కాగా, రిలీవ్ అవుతున్న వారు త‌మ క్యాడ‌ర్ చివ‌రి స్థానంలో ఉంటార‌ని చెప్ప‌డం, అందుకు ఉద్యోగులు అంగీక‌రించ‌డంతో వారిని రిలీవ్ చేస్తూ ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article