సాహిత్యంసూర్య‌నారాయ‌ణ స్వామికి అదిత్యుని స్ప‌ర్శ‌

సూర్య‌నారాయ‌ణ స్వామికి అదిత్యుని స్ప‌ర్శ‌

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవాలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి ఆదిత్యుని తాకిన దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు. ఉదయం 6.05 గంటలకు కొన్ని నిమిషాలపాటు ఆవిష్కృతమైన ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారురు. బుధవారం కూడా స్వామివారి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని పండితులు తెలిపారు. ఏటా రెండు సార్లు ఇలాంటి అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ప్రతిఏటా మార్చి 9, 10 తేదీల్లో.. అలాగే అక్టోబర్ నెల 1, 2 తేదీల్లో భక్తులకు కనువిందు చేస్తుంది.ఆదిత్యుని విగ్రహాంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మధన్యమైందంటూ భక్తులు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article