సినిమాపేరు మార్చుకున్న సాయిధ‌ర‌మ్ తేజ్

పేరు మార్చుకున్న సాయిధ‌ర‌మ్ తేజ్

తేజ్ త‌న పేరును సాయి దుర్గ తేజ్‌గా మార్చుకొన్నారు. త‌న పేరులో అమ్మ పేరు కూడా క‌ల‌వాల‌న్న ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకొన్నారు. సాయిధ‌ర‌మ్‌తేజ్ పేరు ర‌క‌ర‌కాలుగా మారుతూ వ‌చ్చింది. ముందు సాయిధ‌ర‌మ్ తేజ్ అన్నారు. ఆ త‌ర‌వాత‌.. ధ‌ర‌మ్ తీసేసి ‘సాయితేజ్‌’గా పిలుచుకొన్నారు. ఇప్పుడు సాయి దుర్గ తేజ్ అయ్యింది. తేజ్ న‌టించిన ‘స‌త్య‌’ అనే షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.ఇక మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశించారు. త‌న త‌ల్లి విజ‌య దుర్గ పేరుతో నిర్మాణ సంస్థ‌ను స్థాపించారు. ఈ పేరుతో త్వ‌ర‌లోనే ఓ సినిమాని ప‌ట్టాలెక్కించ‌బోతున్నారు. ఇందులో తేజ్ హీరోగా న‌టిస్తాడా, లేదా అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article