టాప్ న్యూస్కులమా...కూటమి బలమా...!

కులమా…కూటమి బలమా…!

*ఓటరన్న ఏ వైపు మొగ్గు చూపుతారో…
*దశాబ్దాల చరిత్ర తిరగబడ నుందా..తిరగబడుతుందా..
*మచిలీపట్నంలో మెజారిటీ ఏ పార్టీకి…

ప్రజాభూమి, కృష్ణాబ్యూరో :

మచిలీపట్నం నగర పాలక సంస్థకు ఆదివారం జరిగే ఎన్నికలు కూటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. గెలుపు ఇరు వర్గాలకూ ఎంతో అవసరం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమైనవి. ఒక విధంగా ఈ ఎన్నికలు కూటమి ప్రభుత్వ పని తీరుకు దర్పణంపడతాయి. అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి.
సాధారణంగా ఇటువంటి ఎన్నికలు ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీకి ప్రజలు మొగ్గు చూపి గెలిపిస్తారు.
ఇక మచిలీపట్నం నగర పాలక సంస్తకు జరుగుతున్న ఎన్నికలు శాసన సభకు జరుగుతున్న ఎన్నికల మాదిరిగా ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌ జరుగడానికి అవకాశాలున్నట్లుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మచిలీపట్నం చైర్మన్, మేయర్ పదవులు అధిష్టించాలని ఆశతో ఎదురుచూస్తూ వచ్చారు. ఈ ఎన్నికలు కూడా ఆ సామాజిక వర్గానికి నిరాశనే కలిగించాయి.! అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లంక జ్యోతి నగరంలో వున్న ఒక సామాజిక వర్గానికి చెందిన వారు గనుక, ఆ సామాజిక వర్గానికి చెందిన వారు పార్టీలతో సంబంధం లేకుండా లంక జ్యోతికి ఓట్లువేస్తే విజయం సాధించే అవకాశం వుంటుందా? అని వారిలో వారు సమీక్షించుకున్నారని తెలిసింది.
ఈ నేపథ్యంలో మచిలీపట్నం నగరంలో 1,39,246 మంది ఓటర్లు వున్నారు. ఇందులో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు దాదాపు 35 వేలు, మత్స్యకారులు 12 వేలు, వైశ్యులు 10 వేలు, బ్రాహ్మణులు 8 వేలు, యాదవులు 12 వేలు, గౌడ 10 వేలు, ముస్లింలు 12 వేలు, క్రిస్టియన్లు 10 వేలు, ఎస్టీలు 12 వేలు, ఇతరులు 18 వేలు వరకూ వుంటారని అంచనా. ఇవి ఉజ్జాయింపుగా వున్న ఓటర్ల వివరాలు మాత్రమే. ఇవి ఖచ్చితమైనవి కావు గానీ ప్రజల్లో వున్న అంచనా. అయితే, ఎట్టకేలకు భారీ మెజారిటీతో కూటమికి చెందిన మేయర్, ఎక్కువ మంది కార్పొరేటర్లు, మంచి మెజారిటీతో విజయం సాధించడానికి అవకాశాలు వున్నాయి. అధికారంలో కూటమి ప్రభుత్వం వుంది గనుక చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్‌కల్యాణ్ సారథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత లేదని ఒక సర్వే!

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article