సినిమామహారాష్ట్ర పోలీసుల ధైర్యాన్నికథగా అహో విక్రమార్క

మహారాష్ట్ర పోలీసుల ధైర్యాన్నికథగా అహో విక్రమార్క

మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో దేవ్ గిల్ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో దేవ్ గిల్ ప్రొడక్షన్స్ నుంచి మొదటి ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘అహో! విక్రమార్క’ అంటూ రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.’అహో! విక్రమార్క’ టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ 2024 మార్చి 8న పుణెలోని పింప్రి చించ్‌వాడ్‌లోని డాంగే రోడ్‌లో ఎంతో ఘనంగా జరిగింది. భారీ తారాగణంతో రానున్న ‘అహో! విక్రమార్క’ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.నటుడిగా మారిన నిర్మాత, మగధీర ఫేమ్ దేవ్ గిల్ ఈ ప్రాజెక్ట్ గురించి చెబుతూ.. ‘అహో! విక్రమార్క’తో, మహారాష్ట్ర పోలీసుల ధైర్యాన్ని మరియు అంకితభావాన్ని ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము” అని పేర్కొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article