టాప్ న్యూస్28న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి : నాదెండ్ల మనోహర్

28న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి : నాదెండ్ల మనోహర్

తాడేపల్లిగూడెం:పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి బహిరంగ సభను ఈనెల 28న నిర్వహించనున్నారు. భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లును, ప్రాంగణాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ శుక్రవారం పరిశీలించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 28న ప్రత్తిపాడులో 21 ఎకరాల్లో ఉమ్మడి బహిరంగ సభ ఉంటుందని, రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసైనికులతో పాటు ప్రజలందరిని ఈ సభకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ వేదికపై 175 నియోజకవర్గాల నుండి 500 మంది టీడీపీ – జనసేన నేతలు పాల్గొంటారని తెలిపారు. ఆరు లక్షల మంది ఈ సభలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని, రాజకీయ ప్రస్థానంలో ఈ సభ అద్భుతంగా ఉంటుందని అన్నారు. టీడీపీ నేతలు కూడా ఈ మూడు రోజులూ బహిరంగ సభ విజయవంతానికి పిలుపునివ్వాలని నాదెండ్ల సూచించారు.తాడేపల్లిగూడెంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే జనసేన – తెలుగు దేశం పార్టీల సంయుక్త భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను, ప్రాంగణాన్ని పరిశీలించిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ . ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో చర్చించి పలు సూచనలు చేశారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article