Uncategorizedశభాష్ డీడీ వేళాయుధం…!

శభాష్ డీడీ వేళాయుధం…!

*ఈ పేరు సమాచార శాఖ లో ఓ బ్రాండ్
*వేలాయుధం పనితీరు వెల కట్టలేనిది…
*అనంతపురం టూ చిత్తూరు వయా పుట్టపర్తిఈయన పయనం ఆమోఘం…
*బహుశా డైరెక్టర్ కూడా ఇలా సాహసం చేయలేడేమో…
*అక్రిడేషన్ మంజూరు , కమిటీల ఎంపికయినా…
*జీవో కే సరి కొత్త అర్థం మానవీయ కోణం …
*మానవీయ కోణమే ఈయనకు అత్యంత కొలమానం…
*సమాచార హక్కు చట్టనికే సరికొత్త అర్థం కనిపెట్టిన గొప్ప వ్యక్తి…
*పాత్రికేయుల సంక్షేమమే ఆయన ప్రధాన ధ్యేయం…
*ఫోటోగ్రాఫర్ ఉన్నప్పటికి ఆది చూపని వైనం

అర్హత చిన్నదిన పత్రికలకు…సార్ మాత్రం పీరియాడికల్స్ పేరు ప్రతిపాదన…

  • పుట్టపర్తి సమోసా 60 రు వెచ్చించాడు..
    *హైదరాబాద్ బావర్చి సమోసా 10 రు లే…
    *వేలాయుధం పుట్టపర్తి లో 60 రు కొనుగోలు…
    *పత్రికలన్న, విలేకరులన్నా ఆయన ఇచ్చే విలువే వేరు…
    *ఆయన పై కోర్టు కేసులున్నా ఏమి చేయలేవ్..
    *ఉత్తమ అధికారి అవార్డుకే కొత్త అర్థం పలికారు…
    *తప్పుల బయట రాకుండా కులం కార్డ్…
    *కులం కూడుబెడుతుందా..పెడుతుంది…పెట్టింది..
    *ఆ ఎన్నికల ఎల్ ఈడీ ఏమైనది…
    *ఎన్ని ఫిర్యాదులిచ్చిన పట్టించుకోనే వారు లేక పోయే…
    *గత డైరెక్టర్ విచారణ జరిపించాలని అడిషనల్ డైరెక్టర్ కు ఆదేశాలు ఇచ్చినా..
    *ఆమె అవినీతికి కేరాఫ్…కుల పిచ్చి తోడు ..
    *అక్కడ ఆర్జేడీకి అసలు పట్టక పోయే…
    *ఉద్యోగం కడప ఉండేది కర్నూలనే ఆరోపణలు …
    *వేలాయుధం వాడిన వాహనం రిపేరు ఖర్చు 20 వేలు…
    *ఆ కారు ఉంచిన షేడ్ అద్దె దాదాపు 2 లక్షలు…
    *ఐదు సంవత్సరాలు ప్రవేటు షేడ్ లోనే తుప్పు పట్టినా…
    *ఇది తప్పని చెప్పే అధికారులు లేకపోయే…
    *రిపేరు ఖర్చు కోసం నిధులు మంజూరు అయిన వాడని వైనం…
    *కింది స్థాయి ఉద్యోగులతో వసూళ్ల పర్వం…
    *అంతర్గత విచారణ లో ఫోన్ పే వివరాలు…
    *డబ్బులు తిరిగివ్వమని అడిగితే తిట్ల పురాణములట…
    *అతి త్వరలో ఆర్జేడీ గా వస్తానంటు పరోక్ష బెదిరింపులట…
    *అధికార ఫోన్ ద్వారా అశ్లీల వీడియోలు బైటికి వచ్చినా…
    *అవి ఎలా వచ్చాయని నిర్దారణ అయ్యేదెన్నడు…
    *అభినవ అంబెడ్కర్ కొత్త ఆర్జేడీ చర్యలు తీసుకుంటారా…తుస్ మంటారా..
    *వేలాయుధం పై చర్యలకు వేళయినట్లేనా…?
    (రామమోహన్ రెడ్డి)

  • . ఎన్ వేలాయుధం ఈ పేరు సమాచార శాఖలో రాయలసీమ జిల్లాలోని ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి అనంతపురం జిల్లాలలో మారు మ్రోగిపోతూ ఉన్నది. ఆయన నిజాయితీకి నిలువెత్తు రూపం.చట్టం,ధర్మం న్యాయం అంటే ఆయనే ప్రతిరూపం. సమాజం పట్ల అవగాహన, వ్యవస్థ పట్ల నిబద్ధత, వృత్తి పట్ల ఉన్న అంకిత భావం మరువలేనిది అసలు సమాచార శాఖంటే వేలాయుధం వేలాయుధం అంటే సమాచార శాఖ అన్న పెద్దగా అచ్చర్యం పడాల్సిన అవసరమే లేదు.ప్రబుత్వ నిబంధనలన్నా,ప్రభుత్వ నిధులన్నా, విధులన్నా అలుపు సలువు లేకుండా అహర్నిశలు కష్ట పడే మనస్తత్వం కలిగిన గొప్ప వ్యక్తి.తన ఉద్యోగ ధర్మం కోసం కులము,బంధు ప్రీతి ,వివక్ష చూపని వ్యక్తి.సమాచార హక్కు చట్టాన్ని తూచా పాటించడం లో ఆయన తరువాతే ఎవరయిన అని చెప్పడం లో వింతేమి లేదు.ఆయన ఉద్యోగ ప్రస్తానం ఆమోఘం.అందుకే ఆయన జీవితం లో ఆయనకు ఆయనే ఉత్తమ అధికారి గా పేరు ను ప్రతిపాదించు కుని ఉన్నతాధికారుల ద్వారా అవార్డులు పొందుతూ ఉంటారు.ఇలాంటి గొప్ప ఉద్యోగి సమాచార శాఖ కు దొరకడం ఎంతో అదృష్టం గా బావిస్తుంది.ఈయన ఉద్యోగ ప్రస్తానం ఉమ్మడి చిత్తూరు ఉమ్మడి అనంతరం పురం జిల్లాలకే పరిమితము చేస్తూ ప్రమోషన్స్ అన్ని కూడా సొంత ప్రాంతంలోనే ఉండేలా ఉన్నతాధికారులు కూడా అవకాశం కల్పించారంటే ఆయన సేవలు ఆ రెండు ఉమ్మడి జిల్లాలకు ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. ఈయన చేసిన అద్భుతమైన కార్యక్రమాలు గురించి చెప్పుకోవాలంటే పూర్తి వివరాలు పరిశీలిస్తే ఇలాంటి అధికారికి ఎందుకు అత్యున్నత స్థాయి ఇవ్వలేక పోతున్నారని ప్రశ్న తలెత్తుతాయి. ఇంతకీ ఆ వివరాలు ఏమిటా అని అందరు నిశితంగా గమనించాలని ప్రజాభూమి కోరుకుంటుంది…
    ఇక అసలు విషయానికి వస్తే… ఒక రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్న అన్ని శాఖల సమాచారాన్ని ప్రజలకు మీడియా ద్వారా చేరవేసేది సమాచార పౌర సంబంధాల శాఖ ఒకటి.ఈ పౌర సంబంధాల శాఖ నిర్వహణ అనేది ఆ శాఖ అధికారులకు చాలా ఒత్తిడితో కూడుకొన్నదని చెప్పాలి.అయితే ఈ ఒత్తిడి నిజమైన ఉద్యోగి కి ఉంటుందనేది యదార్థం. వేలాయుధం లాంటి అధికారులకయితే ఎడారిలో ఇసుక నుండి కూడా థైలం ఎలా తీయాలో తెలిసిన నిష్ణాతుడని చెప్పాలి.ఎందుకయ్యా అంటే ఒక వ్యవస్థ లో ఎన్ని రకాల అవినీతి చేయచ్చోన్న విషయంలో పిహెచ్డీ పట్టా పొందిన వ్యక్తి వేలాయుధమని చెప్పాలి.
    ఈయన తిరుపతి నుండి డిపిఆర్వో గా ,అసిస్టెంట్ డైరెక్టర్ గా అనంతపురం లోనే జిల్లా విభజన తరువాత శ్రీ సాత్యసాయి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ,ఆ తరువాత డిప్యూటీ డైరెక్టర్ గా సొంత జిల్లా చిత్తూరు జిల్లా లో ప్రస్తుతం ఉన్నారు.అనంతపురం జిల్లాలో డిపిఆర్వో గా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు పత్రికలతో నేరుగా సంబందాలు లేకుండా కేవలం ఆఫీస్ కే పరిమితము చేయడం జరిగినట్లు అనంతపురం జిల్లా లోని అధికారులకు ,పత్రికల వారికి తెలిసిందే.కారణం పత్రికా ప్రకటన కూడా సరిగా ఇవ్వలేరని.ఆ పని తనం ఇప్పుడు కూడా చిత్తూరు జిల్లా లో కూడా తేట తెల్లం అవుతూనే ఉంది.ఇందులో సందేహాఁ లేదు.అలాంటి గొప్ప అధికారి వేలాయుధం కు అసిస్టెంట్ డైరెక్టర్ గా అనంతపురం లోనే పదోన్నతి ఇవ్వడం జరిగింది.కారణం ఆయన కులం కార్డ్ అన్నది అప్పట్లో ప్రచారం బాగా జరిగింది. ఇక జిల్లాల విభజన లో అనంతపురం నుంచి శ్రీ సత్య సాయి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ గా పీఆర్ వింగ్ తరువున అక్కడ పెద్ద పీట వేయడం జరిగింది.ఈ నేపధ్యంలో సమాచార శాఖ కార్యాలయ అధికారుల పర్యటన కొరకు బోలెరో వాహనం,స్వరాజ్ మజ్డ వాహనం రెండు శ్రీ సత్యసాయి జిల్లాకు కేటాయించడం జరిగింది.ఇంకేముంది సారు వారికి సంబరాలు మొదలై నట్లు చెప్పచ్చు.
    కారణం వేలాయుధం సార్ కి ఎప్పుడు నిధుల కొరత తక్కువ అయ్యిందో అప్పుడు బొలెరో వాహనం మరమ్మతులకు రావడం పరిపాటిగా మారడం నిత్య కృత్యమైనదని అనేక ఆరోపణలు లేక పోలేదు. ఇక జిల్లాలో పని చేసే పాత్రికేయుల కు ప్రభుత్వం అందించే అక్రిడేషన్ కార్డు ల మంజూరు,అక్రెడిషన్ కమిటీ ల సభ్యుల ఎంపిక ఏదైనా సార్ వేలాయుధం వెల కట్టి ఏలు బడి సాగించడాని అనడానికి ఇప్పటికే లోకాయుక్త,హైకోర్టు లలో నడుస్తున్న కేసుల ను బట్టి చెప్పచ్చు. ఇక్కడ ఈయన గొప్ప తనం ఏమిటంటే ప్రభుత్వం రూపొందించిన అక్రిడేషన్ జీఓకే సరికొత్త అర్థం పరమార్థం కనిపెట్టిన గొప్ప శాస్త్రవేత్తని అనడం లో తప్పులేదు.అక్రిడేషన్ మినిట్స్ లో మానవీయ కోణం అని పేర్కొన్న అధికారి బహుశా వేలాయుధం తరువాతే ఎవరైన అని చెప్పచ్చు. ఇక సమాచార హక్కు చట్టానికి కూడా సరికొత్త నిర్వచనం సూచించిన అభినవ అంబెడ్కర్ అన్నా తప్ప
    కాదేమి కాదని ఆనచ్చు.సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు డారుడు కోరిన సమాచారం ఇవ్వడానికి ప్రతి పేజీకి 2 రూపాయలు అనేది వాస్తవం.కానీ ఈయన మూడు రూపాయలని నిర్దారణ చేసిన గొప్ప వ్యక్తి గా పరినగణలోకి తీసుకోవచ్చు.ఇక ఫొటో గ్రాఫర్ కు అక్రిడేషన్ కమిటీలో స్థానం ఇవ్వాల్సి ఉండి ఫోటోగ్రాఫర్ చిన్న దిన పత్రికల తరుపున ఉన్నా దానిని దాటవేసి పీరియాడికల్స్ తరుపున పేరు ప్రతిపాదనలు పంపిన అత్యుత్తమ అధికారి వేలాయుధమే. ఇక పుట్టపర్తిలో పాత్రికేయులు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయితే భోజన, టీ స్నాక్స్ ఇవ్వడం అనేది ప్రబుత్వ అధికారులు ఇచ్చే గౌరవం.అయితే అందులో కూడా వేలాయుధం పుట్టపర్తి లో జరిగిన ఓ మీటింగ్ లో 60 రూపాయల సమోసా ఇచినట్లు దొంగ లెక్కలు రాసి బిల్లులు డ్రా చేసిన నిజాయితీ కి నిలువెత్తు గా నిలిచారు వేలాయుధం.ఇక్కడ అచ్చర్యం ఏమిటంటే హైదరాబాద్ ఇరాని కేఫ్,భావర్చిలో ఉల్లి సమోసా 5 రూపాయలు, అలు సమోసా అయితే 10 రూపాయలు మాత్రమే.కానీ పుట్టపర్తి సమోసా 60 రూపాయలంటే అందులో పుట్టపర్తి సాయిబాబ కంటే మహిమ కలిగిన సమోసా ఇచ్చారా అని అనేక ఫిర్యాదులు ఉన్నతాధికారులకు కూడా కొంతమంది జర్నలిస్ట్ లివ్వడం జరిగింది.
    ఇక ప్రభుత్వమన్నా ప్రభుత్వ ఆస్తులన్నా వేలాయుధం కు ఉన్న విలువ గౌరవం ఎంతటిదా అంటే పాత్రికేయ సమావేశం కోసం ఉపయోగించే స్వరాజ్డ్ మజ్డా వాహనం రిపేరు ఖర్చు అక్షరాలా ఇరవైవేల రూపాయల వరకు అవుతుంటే గత ఐదు సంవత్సరాల కాలంగా ఒక ప్రవేటు కాళీ స్థలంలో రిపేరు కొరకు ఉంచిన అద్దె ఖరీదు అక్షరాల రెండు లక్షల రూపాయల వరకు మాత్రమే చెల్లించ వలసి ఉంది. ఆ వాహనం ఐదు సంవత్సరాలు కావస్తున్నా అటు సమాచార శాఖ కార్యాలయంలో గానీ ఇటు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో లేకుండా ప్రవేటు వ్యక్తుల చేతుల్లో ఉంచడం మూలానా అసలు ఆ వాహనం వాస్తవ పరిస్థితి ఏమిటి ఇప్పుడున్న పరిస్థితి లో వాహనం యొక్క స్థితిగతులు ఏమిటీ ఆ వాహనం యొక్క ఇంజన్,ఇతర విలువైన పరికరాల మార్పు జరగలేదని కచ్చితంగా నిర్దారణ చేసే వారు ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది.దీనికి తోడు ఇప్పుడు ఆ వాహనం మూల పడిన అంటే పనికిరాని వస్తువుగా చూపించి పాత సామానుల కు అమ్మి చేతుల దులుపు కోవచ్చన్న ఆలోచన లో ఉన్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
    అయితే ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సిన ,ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే వాహనం రిపేరు కోసం బడ్జెట్ మంజూరు అవ్వడం దానిని వినియోగించుకోకుండా వదిలివేసి సదరు కార్యాలయంలో పని చేసే కింది స్థాయి సిబ్బంది వద్ద మొదట అప్పు ఆ పై వాహనం రిపేరని చెప్పి ఆ వాహనం రిపేరు కాక ఆ డబ్బులు ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వక తాను ఆర్జేడీ కడప కు వస్తానని అప్పుడు అందరిపై కక్ష తీర్చుకుంటానని బెదిరించడం, ఆ విషయం శాఖా పరమైన విచారణ లో ఫోన్ పే ఆధారాలు కూడా ఇవ్వడం జరగిందని ఆఫ్ ది రికార్డ్ విచారణ అధికారులు తెలియ పరుస్తున్నారు. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల విషయాలు తెలుసుకునెందుకు ఏర్పాటు చేసిజ్ ఎల్ ఈడీ టీవీ ఏ ఇంట్లో దాగి ఉందొ వేలాయుధం గారికే తెలుసునని అక్కడ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయాల పై కూడా సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినా కూడా సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అనేక ఫిర్యాదులు కూడా పై అధికారులకు చేసినా పట్టించుకోకుండా ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు డిప్యూటీ డైరెక్టర్ గా అధికారిక ఫోన్ నుండి అశ్లీల వీడియోలు విడుదల అయ్యి దానిపై ప్రముఖ ఎలాంటి మీడియా లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ఇప్పటికి ఆ వీడియో లు ఎలా వచ్చాయి.. స్వయం తప్పిదామ హ్యాకర్లు చేసారా అన్నది నిర్దారణ అయ్యిందా అంటే సరైన సమాధానం దొరకని పరిస్థితి.
    ఇక మరొక విషయానికి వస్తే కులం కూడు పెడుతుందా అంటే అవుననే చెప్పచ్చు వేలాయుధం విషయంలో .సమాచార శాఖ పూర్వపు డైరెక్టర్ హిమాన్స్ శుక్లా కు వేలాయుధం పై ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించి నాటి అడిసనల్ డైరెక్టర్ ఇంచార్జ్ గా ఉన్న మేడం స్వర్ణలత ఓకే కులం, అవినీతి లో కూడా తాను కూడా తక్కువేమీ కాదని ఆ విచారణ జరిపించకుండానే కాలాన్ని వెళ్లబుచ్చి కాగితాలను చెట్టబుట్టలో వేసి వెళ్లిపోవడం జరిగింది అంతకంటే ముందు కడప ఆర్జేడీ మహబూబ్ బాషా కు వేలాయుధం పై అనేక ఫిర్యాదులు చేసినా అయన కూడా ఆ ఫిర్యాదులను బుట్టడాఖాలు చేసినట్లు వేలాయుధం అవినీతి పై న్యాయ పోరాటం చేస్తున్న వారు తెలియ పరుస్తున్నారు. ఈ ఆర్జేడీ కడప లో విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఆయన కర్నూలులో ఉంటూ ఆ జోన్ ను గాలికి వదిలి వేయడం వల్ల ఇలాంటి అవినీతి ఆరోపణలు ఆయా జిల్లాలలో చోటుచేసుకున్నాయనే విమర్శలు లేక పోలేదు. ఇప్పుడు జేడీ అడ్మిన్ గా డైరెక్టరేట్ లో ఉండడం మూలానా వేలాయుధం ప్రబుత్వ విధుల పట్ల నిర్లక్ష్యం, దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఆస్తిని అంటే వాహనాన్ని నాశనం చేసిన విషయాన్ని బైటికి రాకుండా పాత సామాన్లు కింద అమ్మేసి ఆ రికార్డ్ లకు ముగింపు పలుకుతాడనే బలమైన విశ్వాసం తో వేలాయుధం ఉన్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
    ఇలాంటి పరిస్థితుల్లో ధర్మం కోసం తన కుటుంబాన్ని సైతం త్యాగం చేసిన సత్య హరిశచ్చంద్రుడు కంటే ఎక్కువగా
    ఉద్యోగ ధర్మం కోసం ఏ చిన్న తప్పును కూడా సహించనివాడు,రాజ్యాంగం రాసిన నాటి అంబెడ్కర్ కంటే ఎక్కువగా రాజ్యాంగ స్పూర్తితో పనిచేసే అసలు ఉద్యోగం డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ అయ్యి సొంత జిల్లాను చక్కబెట్టాలని కడప ఆర్జేడీ గా డిప్యూటేషన్ పై బాధ్యతలు నిర్వర్తిస్తున్న వేంకటేశ్వర ప్రసాద్ ఈ వేలాయుధం వ్యవవహరం పై స్పందించి చర్యలు తీసుకుంటారా లేక సర్దుకు పోతారా అన్నది వేచి చేస్తూ ప్రస్తుత డైరెక్టర్ సమాచార శాఖలో జిల్లాలలో జరుగుతున్న అవినీతి పై ఉక్కుపాదం మోపక పోతే సమాచార శాఖకు చీడ పురుగుల బెడద ఎక్కువవుతుందని చెప్పక తప్పని పరిస్థితి.ఇంకొక ప్రధానమైన కీలకమైన అంశం ఏమిటంటే ఆయన ఉద్యోగం ప్రమోషన్ అంతా కూడా ఆయన స్వస్థలం రాయలసీమ, ఇప్పుడు చిత్తూరు జిల్లాకే పరిమితం కావడం ప్రత్యేకత.ఈ రాష్ట్రంలో వేలాయుధం ఏలుబడి బహుశా ఉమ్మడి రాష్ట్రంలో కూడా సమాచార శాఖ లో జరిగి ఉండదేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా అధికారులని కూడా చూడకుండా జిల్లాల సరిహద్దులు దాటి సుదూర ప్రాంతాలకు ప్రమోషన్ పేరుతో బదిలీ చేస్తున్న సమాచార శాఖ వేలాయుధం ను మాత్రమే రాయలసీమ జిల్లాలకు పరిమితం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనే ప్రశ్న అదే శాఖ అధికారుల నుండి బహిర్గతం చేస్తున్నారు. అదే మరి కులం కూడు పెడుతుందా అంటే వేలాయుధం కు మాత్రమే ఆ ఒక్క మినహాయింపు ఇచ్చారు మేడం స్వర్ణలత. అందుకే శభాష్ వేలాయుధం, శభాష్ స్వర్ణ లతని అనని తప్పని పరిస్థితి దాపురించింది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article