టాప్ న్యూస్పడగవిప్పిన మాఫియా…

పడగవిప్పిన మాఫియా…

*ఆర్థిక రాజధానిలో అనేక మోసాలు ..
*చెట్టు పేరు చెప్పి కాయలమ్మిన చందాన ..
*భూమి ఇకటి అగ్రిమెంట్ ఇంకొకటి …
*అమాయక మహిళలే టార్గెట్…
*లాభాల ఆశ చూపి అప్పనంగా దోచుకోవడం…
*అడిగితే అన్యాయపు పనులకు పాల్పడటం…
*భక్తి పేరుతో ఒకడు…సారా బుడ్డి పేరుతో ఇంకొకడు…
*ముగ్గురు మొనగాళ్ళు…మోసగాల్లు
*చట్టాన్ని చుట్టం చేసుకుని… ధర్మాన్ని అధర్మం చేస్తూ…
*అబల సొమ్మును అప్పనంగా దోచేసి…
*ఏడాదీన్నెర్ర నిరీక్షణ తరువాత…
*భూ మాయపై పోలీసులను ఆశ్రయించిన బాధితులు…
*కేసు నమోదు తో నకిలీ అగ్రిమెంట్స్ బట్టబయలు…
*దువ్వాడ పోలీసు స్టేషన్ పరిదిలో బోలెడు భూ దందాలు…
*కోట్లల్లో ఆశ లక్షల్లో దోపిడీ…
*విశాఖ భూ మాఫియా పై ఉక్కుపాదం మోపేదెన్నడూ..

(రామమోహన్ రెడ్డి)


తమ రక్తాన్ని చెమట చుక్కగా మార్చి రూపాయి రూపాయి కూడబెట్టి ఏదయిన పెట్టుబడి పెడితే ఆరూపాయికి మరో రూపాయి తోడై తమ జీవితాలలో ఎంతో కొంత వెలుగులు వస్తాయన్నపేదవారి ఆశ అన్న బలహీనత బడా మోసగాళ్లకు వరం గా మారుతుందని చెప్పడం లో పెద్దగా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని స్పష్టం అవుతోంది.ధనం మూలం ఇదం జగత్” అంటే “ఈ ప్రపంచానికి ధనమే మూలం” అని అర్థం. ఆధునిక కాలంలో, మనుగడకు, గౌరవానికి, మరియు సకల కార్యాల సాధనకు ధనం ఇంధనం లాంటిదని, డబ్బు లేని జీవితం అత్యంత దయనీయంగా ఉంటుందని ఈ నానుడి తెలియజేస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో సంతోషం, బంధుత్వాలు, మరియు వస్తుసామగ్రి ధనంపైనే ఆధారపడి ఉన్నాయని చాలామంది భావించడం పరిపాటిగా మారింది. ఇలా ఎందుకు అనాల్సి వస్తుందని అంటే
దేశంలోనే అత్యుత్తమ నగరాలలో ఒకటిగా పేరుగాంచిన ఏపీ ఆర్థిక రాజధాని విశాఖలో భూమాఫియా పడగ విప్పి
పేదవారి కోరిక,ఆశను అడ్డుపెట్టుకుని అప్పనంగా దోచుకుని ఒక నిరుపేద రాలిని ఈ సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసి ఎవరికి చెప్పుకోలేని విదంగా చేసి ఏడాదిన్నర్రా కాలం పాటు న్యాయం కోసం ఖాకీల చుట్టూ కాళ్ళు అరిగి పోయేలా తిరిగితే చివరికి ఆమె జీవితంలో జరిగిన అత్యంత దురదృష్టకర సంఘటన ఆనవాళ్లకు అడ్రెస్ లేని విధంగా విధి ఆమె జీవితం తో ఆడుకుంటున్న తీరు చూస్తే ఇదేనా నవ భారత నిర్మాణం అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…

గ్రేటర్ విశాఖ పరిధిలో పెదగంట్యాడ మండలం అప్పీకొండ గ్రామ సరిహద్దుల్లో ని సర్వే నెంబర్ 18/3,18/4 గల పొలము అక్రమ లే ఔట్ లు వేసి అమ్మకాలు జరిగాయి.అయితే ఈ అక్రమ లే ఔట్ ఏర్పాటు కాక ముందే ఓ బాధిత మహిళ నుండి వివిధ మార్గాల ద్వారా డబ్బులు తీసుకుని ఒక అగ్రిమెంట్ వ్రాసి ఇవ్వడం జరిగింది.అయితే ఈ పొలము ప్లాట్లు గా విభజించి ఎక్కువ లాభం తిరిగి ఇప్పిస్తామంటూ అక్రమ లే ఔట్ వేసిన ముగ్గురు వ్యక్తులు బాధిత మహిళ ద్వారా డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ రాసివ్వడం జరిగింది.ఇలా కొంత కాలం జరిగిన తరువాత బాధిత మహిళ తనకు రాసి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు తిరిగి ఇవ్వమని కోరగా ఒంటరిగా ఉన్న మహిళ ను తీవ్ర ఇబ్బందులు పెట్టినట్లు గా బాధిత మహిళ వాపోయింది. అయితే సమాజంలో ఉన్న తీరు తెన్నులు సదరు అక్రమ లే ఔట్ దారులు భయభ్రాంతులకు గురిచేస్తున్న తీరుతో ఆ అబల ఒంటరిగా ఉండిపోవాల్సి న పరిస్థితి దాపురించడం ఈ సభ్య సమాజం చేసుకున్న పాపంగా చెప్పాల్సి వస్తోంది. ఇలా కొన్ని నెలలు గడిచినా డబ్బులు ఇవ్వక ఆ ప్లాటు ఇవ్వక పోవడంతో బాధిత మహిళ దువ్వాడ పోలీసులను ఆశ్రయించిన ఆశించిన న్యాయం జరగపోవడం తో నగర సీపీ ని కలిసి సమస్యను విన్నవించుకున్నా ఆయన ఆదేశాలు కూడా బుట్ట దాఖలు అయ్యి చివరికి న్యాయం అన్నది అంగడిలో సరుకులాగా అయ్యే లోపల ఏదో బాధిత మహిళ ద్వారా గతం తాలూకు జరిగిన సంఘటన వివరాలు నిరూపితం కావని కొత్తగా పిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలియవచ్చింది.మరి ఇప్పుడైనా ఆ మహిళ కు జరిగిన అన్యాయం కు న్యాయం జరుగుతుందా లేక అక్రమ లే ఔట్ ద్వారా ఒకడు భక్తి మరొకడు బ్రాందీ విస్కీ మత్తుకు మొత్తం వ్యవవహారమే మారిపోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా అక్రమ లే ఔట్,లేని భూమిని ఉన్నట్టు చూపించి అటు ప్రజలను ఇటు ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్న అక్రమార్కులపై సంబందిత శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు..

ఎవరా బాధితురాలు… నిజంగా ఆమె పట్ల జరగరాని ఘోరం జరిగిందా… ఆ ఆక్రమ లే ఔట్ దారులు అంత నీచంగా వ్యవహరుఁచరా..అసలు ఆ లే ఔట్ అక్రమ సక్రమమా… ఈ సంఘటన లో ఏది నిజం… ఏది అబద్ధం.. ఎవరిది న్యాయం.. ఎవరిది అన్యాయం… పోలీసులు మాటేమిటి… రెవెన్యూ,మున్సిపల్ అధికారులు పరిశీలించారా..లేదా …

దీనిపై పూర్తి వివరాలు మరో సంచికలో..

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article