క్రీడలురంజీ ట్రోఫిలో పుజారా వరుస సెంచరీలు..!

రంజీ ట్రోఫిలో పుజారా వరుస సెంచరీలు..!

జైపూర్ వేదికగా జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా సెంచరీ నమోదు చేశాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పూజారా సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర జట్టుకు ఓపెనర్లుకు మంచి అరంభం లభించలేదు . ఓపెనర్లు కెవిన్ (0), హార్విక్ దేశాయ్ (21) తొందరగానే ఔటవగా, ఆ తర్వాత విశ్వరాజ్ జడేజా 22 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. పుజారా షెల్డన్ జాక్సన్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 230 బంతులు ఎదుర్కొన్న ఛెతేశ్వర్ పుజారా 9 ఫోర్లతో 110 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో బరిలోకి దిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నిలకడగా బ్యాటింగ్‌ చేస్తూ.. జట్టును తొలి షాక్ నుంచి గట్టెక్కించాడు.ఇక ఈ శతకంతో.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఛేతేశ్వర్ పుజారాకి ఇది 62వ సెంచరీ కావడం గమనార్హం. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయుడిగా 3వ స్థానంలో నిలిచాడు. 68 సెంచరీలు చేసిన ద్రవిడ్ 2వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో 62వ సెంచరీతో పుజారా 3వ స్థానానికి చేరుకున్నాడు.ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్స్ సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సచిన్, సునీల్ గవాస్కర్ 81 సెంచరీలు చేశారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article