తాజా వార్తలుపశువుల కంటైనర్ పై పోలీసుల దాడి

పశువుల కంటైనర్ పై పోలీసుల దాడి

-40పశువులు స్వాధీనం
-5 మందిపై కేసు నమోదు

గొల్లప్రోలు

కబేళాకు అక్రమంగా పశువులను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం కంటైనర్ పై దాడి చేసిన పోలీసులు 40 పశువులను స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు పరిశీలిస్తే…
ఇచ్చాపురం జిల్లా మానాపురం పశువుల సంత నుండి కృష్ణా జిల్లా గుంటూరు మండలం హనుమాన్ జంక్షన్ కు కంటైనర్ వాహనంలో 40 ఎద్దులను అక్రమంగా గోవధకు తరలిస్తున్నారని ముందుగా అందిన సమాచారం మేరకు అప్రమత్తమైన గొల్లప్రోలు పోలీసులు మండల పరిధి వన్నెపూడి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు.కత్తిపూడి నుండి రాజమండ్రి వైపుగా వెళుతున్న కంటైనర్ ను అనుమానించిన పోలీసులు ఆపి పరిశీలించగా వాహనంలో 40 ఎద్దులు తాళ్లతో బంధించి ఉన్నట్లు గుర్తించారు.దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పశువులను భద్రత నిమిత్తం గోశాలకు తరలించారు. పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు కూలీలు,కంటైనర్ డ్రైవర, క్లీనర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ బాలాజీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article