తాజా వార్తలునాకు ప్రాణ హాని ఉంది

నాకు ప్రాణ హాని ఉంది

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు వైఎస్ సునీత ఫిర్యాదు

వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపుతామంటూ ఫేస్ బుక్ వేదికగా బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. లేపేస్తాం అనే విధంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. తనపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ, సునీత తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా ఫిర్యాదు చేశారని చెప్పారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article