తాజా వార్తలునంద్యాల రాష్ట్ర మహాసభలకు ఏపీ మహిళా సమాఖ్య నేతలు, కార్యకర్తలు

నంద్యాల రాష్ట్ర మహాసభలకు ఏపీ మహిళా సమాఖ్య నేతలు, కార్యకర్తలు

ప్రజాభూమి, అనంతపురము
నంద్యాల జిల్లా కేంద్రంగా ఈనెల 17, 18, 19వ తేదీల్లో జరుగనున్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సమాఖ్య 15వ మహాసభలకు అనంతపురం జిల్లా మహిళా సమాఖ్య నేతలు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్ళారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ నీలం రాజశేఖర రెడ్డి భవన్ నుంచి సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి, గౌరవాధ్యక్షురాలు కమ్మక్క, నగర కార్యదర్శి ఖుర్షీద, అధ్యక్షురాలు జానకి, సహాయ కార్యదర్శి యశోద, లక్ష్మిదేవి నేతృత్వంలో 300 మంది సమాఖ్య శ్రేణులు మహాసభలకు వెళ్ళారు. మహాసభల నేపథ్యంలో 17న సాయంత్రం 5000 మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు
సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి తెలిపారు. అనంతరం బహిరంగ సభ ఉంటుందని 18,19వ తేదీల్లో సమాఖ్య ప్రతినిధుల మహాసభలో అనంతపురం జిల్లా నుంచి 30 మంది ప్రతినిధులు పాల్గొంటున్నట్లు తెలిపారు. నంద్యాల మహాసభలకు మహిళా సమాఖ్య శ్రేణులు వెళ్లేందుకు సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శులు రమణ, అల్లిపీర, నాయకులు రజాక్, రాజు, శ్రీనివాసులు సహకరించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article