తాజా వార్తలుకందుకూరు నుండి సిద్ధం సభకు 35 వేల మంది తరలించిన సమన్వయకర్త బుర్రా

కందుకూరు నుండి సిద్ధం సభకు 35 వేల మంది తరలించిన సమన్వయకర్త బుర్రా

మేనిఫెస్టో వందశాతం అమలుకు సిద్ధం….

కనిగిరి :సిద్ధం సభ కందుకూరు నియోజకవర్గం నుండి 35,000 నుండి 40 వేల వరకు కందుకూరు పట్టణం, కందుకూరు మండలం, గుడ్లూరు, లింగసముద్రం, ఉలవపాడు, వి వి పాలెం, మండల కేంద్రాల నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కందుకూరు నియోజకవర్గం సమన్వయకర్త బుర్రా మధుసూదన్ ఆధ్వర్యంలో తరలించడం జరిగిందని మండల కేంద్రాలలో నాయకులు తెలిపారు. కందుకూరు పట్టణంలో జెండా ఊపి సిద్ధం సభకు సిద్ధం అని కందుకూరు సమన్వయకర్త బర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ సిద్ధం సభ ప్రజా సేవకు సదా, రైతుకు భరోసాకి,’నాణ్యమైన విద్యకు,’మెరుగైన వైద్యానికి,’వృద్ధులకు అండగా ప్రజా క్షేమానికి,పారిశ్రామికాభివృద్ధికి,సామాజిక న్యాయానికి, ఉద్యోగుల సంక్షేమానికి,మహిళా సాధికారతకు, యువత ఉద్యోగ, ఉపాధికి, మహిళా శిశు సంక్షేమానికి, ఇచ్చిన మాటపై నిలబడ్డానికి,మేనిఫెస్టో వందశాతం అమలుకు సిద్ధం మొత్తంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సదా సిద్ధం ఎన్ని పార్టీలు ఏకమై గుంపుగా వచ్చినా ‘ప్రజలు తోడుగా’ ఎన్నికల యుద్ధానికి సిద్ధం. అని అంటూ సిద్ధం సభకి వేలాది మందితో అద్దంకి నియోజకవర్గ పరిధిలో మేదరమెట్లలో సిద్ధం సభకు మేము సిద్ధం.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article