*ఇది సమాచార శాఖ కే సరికొత్త అధ్యాయం…
*సమాచార శాఖ చరిత్ర తిరగరాయబోతున్న యువ ఐఏఎస్…
*అవినీతి పరుల గుండెల్లో గుబులు రేపుతున్న కొత్త విధానాలు
*నర్మ గర్భంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన డైరెక్టర్…
*చిన్న పత్రికల ఎంప్యానల్మెంట్ పై సమగ్ర విచారణ…
*జూన్ 2024 నుంచి ఆగస్టు 2026 వరకు రెగ్యులారిటీ పై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు…
*కేవలము మూడు రోజుల్లో నే ఇవ్వాలని కచ్చితమైన ఆదేశాలు…
*అన్ని జిల్లాల పరిధిలో 96 పత్రికల పై పూర్తి పరిశీలన…
*హైకోర్టు నోటీసులతో అసలు విషయం పై ఆరా…
*మరి జిరాక్స్ పేపర్స్ పై జిల్లా అధికారుల చేతి వాటం చూపిస్తారా…
*డైరెక్టర్ గారిని బురిడి కొట్టిస్తారా…
*మేడం స్వర్ణలత పరిపాలనేమిటో బట్టబయలు అవుతుందా…
*రోజు వారి ఇచ్చినవి ఎన్ని… వారాలు, పక్షం,నెలల వారిగా ఇచ్చిన వివరాలు సరిగా ఇస్తారా…
*ఇచ్చేది ఒక కాపీ అది కూడా జిరాక్స్ ఇచ్చిన వాటిపై చర్యలుంటాయా…
*మీడియం తో అక్రెడిటేషన్ పొంది చిన్న పత్రికల గా ఎంప్యానల్మెంట్ పొందిన వాటిని రద్దు చేస్తారా..
*తప్పుడు నివేదికలు ఇచ్చిన వారిపై చర్యలు ఉంటాయా…
*లక్షల్లో ముద్రణ చూపించి ఎంప్యానల్మెంట్ బ్లాక్ లో ఉన్న ఆక్రిడేషన్ పొందిన ,ఇచ్చిన వారి సంగతి తేలుస్తారా…
*ఒక ఎడిషన్ డీఏవిపీలో ఒకటి ..సమాచార శాఖ ఇంకొక రిటర్న్స్ ఇచ్చి దోచుకుంటున్న వారిని అడ్డుకట్ట వేస్తారా…
*ఇవన్నీ సక్రమంగా అమలు జరిగితే…
*అసలు ఎవరు నకిలీ ఎవరో నిజాలు నిగ్గు తెలుస్తారా…
*డైరెక్టర్ గారి కచ్చితత్వాన్ని కరెక్టుగా అమలు చేస్తారా…
*ఇప్పుడైనా అసలైన వారికి న్యాయం జరుగనుందా…
(రామమోహన్ రెడ్డి)
సమాచార శాఖ లో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతం కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.సమాచార శాఖ ఏర్పడిన తొలినాళ్ళ నుండి ఇప్పటి వరకు ఏ కమిషనర్ గానీ డైరెక్టర్ గానీ చేయని సాహసం ప్రస్తుత డైరెక్టర్ యువ ఐఏఎస్ కే ఎస్ విశ్వనాథన్ చేయబోతున్నారా ,ఆయన ఇంత సాహసం చేయడానికి గల కారణాలు ఏమిటి,ఎందుకు ఇంత కచ్చితమైన నిర్ణయం,ఎంతో లోతైన వాస్తవాలను నిగ్గు తేల్చి ఈ సమాచార శాఖ ప్రక్షాళన కు గట్టిగా పునుకున్నారనే భిన్నమైన ప్రశ్నలు ఇప్పుడు డైరెక్టరేట్ లో ఉన్న కొన్ని అవినీతి తిమింగలాలకు రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నా అన్ని జోన్ ల అర్జేడీలు,ఇతర జిల్లా అధికార వర్గాల్లో విస్తృత మైన చర్చ నడుస్తోంది.అందుకు గల కారణాలు లేకపోలేదు. వ్యవస్థలో ద్విగుణీకృతం అయ్యి ఉన్న కింది స్థాయి కొంత మంది అవినీతి అధికారుల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతూ వస్తోంది.
“పత్రికొక్కటున్న పదివేల సైన్యముపత్రికొక్కటున్న మిత్రకోటిప్రజలకు రక్షలేదు పత్రిక లేనిచో”
సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎండగట్టడానికి, ప్రజల పక్షాన నిలబడడానికి ఒక్క పత్రిక ఉంటే అది పదివేల మంది సైన్యంతో సమానమైన శక్తిని కలిగి ఉంటుంది. ప్రజల కష్టసుఖాలను పంచుకుంటూ, వారికి నిరంతరం అవసరమైన సమాచారాన్ని, జ్ఞానాన్ని అందిస్తూ ఒక పత్రిక కోటి మంది మంచి మిత్రుల వలె తోడుగా ఉంటుంది. సమాజంలో పత్రికలు (మీడియా) లేకపోతే పాలకుల అక్రమాలను ప్రశ్నించే వారు ఉండరు. తద్వారా సామాన్య ప్రజల హక్కులకు రక్షణ కరువవుతుంది.పత్రికా స్వేచ్ఛ, సమాజ శ్రేయస్సులో పాత్రికేయుల బాధ్యతను గుర్తుచేసేందుకు ఈ పంక్తులను ఇప్పటికీ విస్తృతంగా ఉటంకిస్తూ ఉంటారు.అయితే అదే పత్రికల ముసుగులో కొంత మంది సంపాదకులు దశాబ్దాల క్రితం నుండి ఆ పత్రిక ఎక్కడ ఉంటుందో కూడా తెలియని మేధావి సంపాదకులు లక్షల రూపాయల ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో దోచుకుని తింటుంటే ఉన్నట్లు అనేక ఆరోపణలు లేకపోలేదు. ఇవన్నీ కూడా అప్పట్లో పత్రికలనేవి ఇన్ని ఉండేవి కావు.ఇంత హడావుడి యర్నలిజం తో కూడిన జర్నలిజం ఇంతలా ఉండేది కాదనద్నది యదార్థం.అందుకే గత వైసిపి ప్రభుత్వం ఒక్క రూపాయి యాడ్ కానీ అక్రిడేషన్ ల విషయంలో కూడా వారి అనుకూల మీడియా కు తప్ప మిగిలిన మీడియాను అనగ ద్రొక్కి వేయడం జరిగింది.అయితే అలాంటి విపత్కర పరిస్తితిలో ,కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉన్న సమయం లో కూడా కొన్ని చిన్న పత్రికలు తమ ఉనికిని చాటుకునే పని చేస్తూనే వచ్చాయి.అలాంటి పత్రికల వల్ల పెద్దగా నష్టం లేకపోయిందనేది ఒక వాదన వినిపిస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత కూడా మీడియా వ్యవస్థ తన విలువలను దిగజార్చే ప్రయత్నం చేయడం మొదలు పెట్టిన గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని పత్రికల వారికి,కొంతమంది సంపాదకులకు సమాచా శాఖ అధికారులు ఎంపిప్యానల్మెంట్ తో సంబంధం లేకుండా రాజ్యాంగం లో ఉన్న జీవోలను వెలికి తీసి బడా నాయకుల పలుకుబడితో ఓవైపు రాష్ట్ర స్థాయిలో ఉన్న ద్వితీయ శ్రేణి అధికార యంత్రాంగం తో కుమ్మక్కు అయ్యి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రకటనల ద్వారా దోచుకు తినడం జరిగింది అందుకు సంబంధించిన కొన్ని పత్రికల బిల్లులు వైసీపీ ప్రభుత్వం లో పూర్తిగా నిలుపుదల చేయడం జరిగింది.అయితే అప్పుడు కూడా ప్రస్తుతం సమాచార శాఖ మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ఇంతలా రాలేదన్న విషయాలు వెల్లడి అవుతున్నాయి.అయితే ఇప్పుడే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందయ్యా అంటే అడిషనల్ డైరెక్టర్ ఇంచార్జి స్వర్ణలత పరిపాలన తీరు వల్లే అన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళ లో కేవలం 23 పత్రికలు మాత్రమే రెగ్యులర్ గా ఉన్నాయని అప్పటి జాయింట్ డైరెక్టర్ ప్రకటనల విభాగం ఇంచార్జ్ గా ఉన్నా తేళ్ల కస్తూరి హయంలో నివేదికల ద్వారా స్పష్టం అయ్యాయి. ప్రకటనలు ఇచ్చినా వాటి ఆనవాళ్లు కూడా తెలియని పత్రికలు కొంతమంది నడుపుతూ పత్రికాది పతులుగా చెలామణి అవుతూ వస్తున్న విషయాలు అప్పుడే బహిర్గతం అయ్యాయి.దీనిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను కోరగా కేవలం 23 పత్రికలు నాలుగు జోన్ల పరిధిలో రెగ్యులర్ గా ఉన్నాయని తేట తెల్లం అవ్వడం జరిగింది.ఆ తరువాత వైసీపీ సానుభూతి పరులు జాబితా లో నాటి కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, తేళ్ల కస్తూరిని ఎలాంటి బాధ్యతలు లేకుండా పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.ఆ అవినీతి కేసులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమయ్యాయో తెలియని వైచిత్రి ప్రస్తుతం ఉంది. తదనంతర పరిణామ క్రమంలో జోన్ 2 ఆర్జేడీ గా ఉన్న స్వర్ణలత , ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ కుర్చీ కోసం పోరాటం చేస్తున్న సి ఐ ఈ ఓ మధుసూదన మధ్య కోర్టు వివాదాలు నడిచినా అడిషనల్ డైరెక్టర్ ఇంచార్జి గా మేడం స్వర్ణలత బాధ్యతలు స్వీకరించడం జరిగింది.ఇంకేముంది పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఎనిమిది పేజీలు కనీసం ఎనిమిది పత్రికలు కూడా ముద్రణ లేకుండా డిజిటల్ జిరాక్స్ ,ఎన్టీఆర్ జిల్లాలో ఏలుబడి సాగించిన ప్రస్తుత మాజీ ఉద్యోగి చక్రం తిప్పిన చందాన 23 పత్రికలు కాస్తా అంచలంచెలుగా పెరిగి నేడు ప్రకటనలు పొందుతున్నవి 72 కు చేరుకున్నాయి. మరి ఈ పత్రికల్ని ఎక్కడ ఉన్నాయో ఏ రోజు ఆరోజుకు రెగ్యులర్ గా ఉన్నాయా అని ఉదాహరణ గా ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా డీపీ ఆర్వో నాగేశ్వర రావు ను అడిగితే అట్లే అర్థం అవుతుంది. దినపత్రిక అంటే ఆ దినంలో కనపడాలని నిబంధన పెడితే 168 నుంచి 68 పత్రికలు ప్రస్తుతం హాజరు పట్టికలో నమోదు కాబడి ఉన్నాయి.ఇంకాస్త గట్టిగా పట్టుకుంటే ఆ సంఖ్య ఇంకా ఏమేర తగ్గుతుందో ఈ పత్రికా లోకానికి తెలుస్తుంది.వాటిలో కూడా ప్రింటింగ్ ప్రెస్ లేమో పెద్ద పెద్దవి సాక్షి ప్రెస్,ఇంకా పేరున్న ప్రైస్ లు సర్కులేషన్ చూస్తే చతికిల బడి పోవాల్సి వస్తుంది.కానీ ఆ పేపర్లు ఎన్టీఆర్ జిల్లా మినహా ఉమ్మడి జిల్లా గా ఆమడ దూరంలో ఉన్న కృష్ణా జిల్లా మచిలీపట్నం సమాచార శాఖ కార్యాలయం లో చూద్దాం అన్న కంటికి కనిపించవు.ఇదే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు జోన్ లు ,ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఇదే పరిస్థితి.డిజిటల్ జిరాక్స్, వారం,పక్షం ఇలా పాపం వారి వారి వెసులుబాటు ,ఆయా జిల్లాల అధికారుల మధ్య ఉన్న సఖ్యత,కొన్ని చోట్ల ఇంకేదో బట్టి రెగ్యులర్ గా ఉన్నట్లు రికార్డులలో నమోదు కాబడి చెలామణి అవుతూ అర్హత కు మించి ఆక్రెడెషన్ పొంది హాయిగా ప్రజా బాహుళ్యామ్ లో చెలామణి అవుతూ ఉంటున్న సంఘటనలు బోలెడు చోటు చేసుకుంటున్నాయి.
ఇందులో అచ్యర్యకర విషయం ఏమిటంటే తమది ఎనిమిది పేజీల పత్రికని చెప్పుకుంటూ ఉన్న వీరి బాగోతం చూస్తే పత్రికా లోకం పక్కన నవ్వుకుంటోంది.కారణం మొదటి పేజీ ,రెండవ పేజీ,ఏడవ పేజీ, ఎనిమిద పేజీ మినహాయిస్తే మిగిలిన మూడు నుంచి ఆరో పేజీలు అన్ని కూడా ఒకే వార్త ,ఒకే డిజైన్,ఒకే విధానం ,ఈ రాష్ట్రం వార్త ఒక్కటి కూడా ఉండకుండా సినిమా,విద్యా,,వైద్యం అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల్లో దొరికే సమాచరం తో మమ అనిపిస్తూ ఉండగా ఇంకొంత మంది అయితే సినిమా,క్రీడలు, ఇంకేదో చూపిస్తూ ఎనిమిది పేజీలతో ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ అవ్వగా కొన్ని డిజిటల్ జిరాక్స్ తో చెల్లుబాటు అవుతూ ఉన్నాయి.ఇవన్నీ డైరెక్టర్, కమిషనర్ లాంటి ఉన్నతాధికారుల దృష్టి వెళ్లకుండా కింది స్థాయి అధికారులు దిగువ స్థాయిలోనే వాస్తవాలను సమాధి చేస్తారు.ఎవరైనా సాహసం చేసి డైరెక్టర్ స్థాయి అధికారులకు ఆధార సహిత పిర్యాదులు ఇస్తే సదరు పిర్యాదు దారుని ప్రలోభ పెట్టడానికి. సమాచార శాఖ బ్రోకర్లు రంగం లోకి దిగి బెదిరించడం,కుదరకపోతే బయటపెట్టడం,అది కుదరకపోతే వాడు పలాన వర్గం,కులం,ప్రాంతం, పలాన పార్టీ అని ఇలా బురద జల్లుతూ తమ చీకటి బ్రతుకులు బ్రతుకుతూ యదేచ్ఛగా జీవనం సాగిస్తున్న వైఖరి లేకపోలేదు.
ఇవన్నీ చూసిన తర్వాత ఒక సామాజిక ఉద్యమ కారుడు మేడం స్వర్ణలత పరిపాలన స్వర్ణయుగంలా జరిగిన తీరుపై లోకాయుక్త ను ఆశ్రయించాడు.అక్కడ కూడా సమాచార శాఖ అధికారులు మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేయడం చూసి చివరికి హైకోర్టు ను ఆశ్రయించి తాను పిర్యాదులిచ్చి ప్రాణాలు కోల్పోవడం తప్ప ఉపయోగం లేదని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్,డిల్లీ ఆర్ ఎన్ ఐ అధికారులను, సమాచార శాఖ ఉన్నతాధికారులను పార్టీ చేస్తూ పత్రికల ముసుగులో ప్రజాధనాన్ని దోచుకుంటున్న తీరుపై పిల్ వేయడం జరిగింది.ఆ పిల్ ఆమోదం పొంది సంబంధిత అధికారులకు నోటీసులు అందడం మూలానా యువకుడు,ఆలోచనా పరుడు,సమయ స్పూర్తి,వృత్తి పట్ల నిబద్దత నిజాయితీ క్రమశిక్షణ కలిగి,అవినీతి,అలసత్వం, నిర్లక్ష్యం కు తావు ఇవ్వక ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో అలుపెరగని శ్రామికుడులా కష్ట పడుతున్న సమాచార శాఖ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురించింది,లోపం ఎక్కడ ఉంది ఎందుకు ఇలా ఆరోపణలు ఎదుర్కుని కోర్టు దృష్టిలో తామెందుకు దోషిగా నిలబడాలని ఈ రాష్ట్రం లో ఇప్పటి వరకు చిన్నపత్రికల సరసన ఉన్న 92 పత్రికల పై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ప్రత్యేక మెమో ఆర్డర్ ను ఈ నెల పదహారవ తేదీన ఇస్తూ మూడు రోజుల గడువు ఇవ్వడం జరిగింది.అయితే ఈ ఉత్తర్వులను ఆయా అధికారులు ఏ మేర పాటించి డైరెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటారో అన్నదే ఇప్పుడు సర్వత్ర వినిపిస్తున్న ప్రశ్న.ఎందుకంటే చనిపోయిన వారి పేరు మీద రికార్డులు ఉన్నా,ప్రింటింగ్ ప్రెస్ లు లేవని జోన్ 3 ఆర్జేడీ రిపోర్టులు ఇచ్చినా,మీడియం కింద అక్రెడిటేషన్ పొంది చిన్న పత్రికల ముసుగులో ఎంప్యానల్మెంట్ ఇచ్చిన ప్రకటనల విభాగం అధికార బృందం ఎంతో తెలివైన వారు కాబట్టి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కానీ నవ్యాంధ్ర ప్రదేశ్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్న నేటి డైనమిక్ డైరెక్టర్ విశ్వనాడన ను ఎలా బురిడి కొట్టించి ఆయన్ను కూడా వీరి జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తారా…డైరెక్టర్ నిర్ణయాన్ని గౌరవించి సంస్కరణ వైపు అడుగులు వేసి నిజమైన సంపాదకలకు స్వాంతన చేకూరుస్తారా అన్నది వేచికూడక తప్పదు.

