సినిమాయాత్ర 2 ట్రైలర్ రిలీజ్.. నేను విన్నాను.. నేను ఉన్నాను

యాత్ర 2 ట్రైలర్ రిలీజ్.. నేను విన్నాను.. నేను ఉన్నాను

యాత్ర సినిమాకి సీక్విల్ గా వస్తున్న సినిమా యాత్ర 2. ఈ మూవీలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా రానుంది. మహి వి రాఘవ్‌ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో వైఎస్. రాజశేఖర్‌రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు మమ్ముట్టి న‌టిస్తుండ‌గా.. సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్ర‌లో కోలీవుడ్ యాక్ట‌ర్ జీవా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజ‌ర్‌, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. తాజాగా మూవీ టీం ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ఇక ట్రైల‌ర్ చూస్తే.. ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చి కొత్త పార్టీ పెట్ట‌డం, జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌డం, జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అనంత‌రం ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు.. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాత్ర 2 సినిమా రానుంది. ఇక చివ‌రిలో నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ జీవా చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article