తాజా వార్తలుడివైఈఓ పరీక్షలకు అవగాహన సదస్సు

డివైఈఓ పరీక్షలకు అవగాహన సదస్సు

గండేపల్లి.
కాకినాడ అంబేడ్కర్ భవన్ లో గ్రూప్స్ మరియు డివైఈఓ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఉచిత అవగాహన సదస్సు జయప్రదం చేయాలని యుటిఎఫ్ గండేపల్లి మండల శాఖ శుక్రవారం తెలిపింది.ఈ సందర్భంగా యుటిఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు ఎం సుభాష్, ప్రధాన కార్యదర్శి డి రాజాబాబు లు సంయుక్తంగా తాళ్లూరు ఎంపీపీపి పాఠశాల నందు ఒక ప్రకటన విడుదల చేశారు.పోటీ పరీక్షల కోచింగ్ నిపుణులు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సారధ్యంలో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు (ఐవి) ఆధ్వర్యంలో యుటిఎఫ్, జెవివి, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాలు ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రూప్స్ మరియు డివైఈఓ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఈనెల 4 తారీకున ఆదివారం సాయంత్రం 4 గం నుండి 7 గం కు కాకినాడ అంబేడ్కర్ భవన్ కి రావాలన్నారు. సదస్సు అనంతరం భారత సమాజం, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article