తాజా వార్తలుజ‌గ‌న్ విదేశీ పర్యటన… తీర్పు 14వ తేదీకి వాయిదా

జ‌గ‌న్ విదేశీ పర్యటన… తీర్పు 14వ తేదీకి వాయిదా

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. దీంతో సీబీఐ లాయర్లు అభ్యంతరం చెప్పారు. సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్ద‌ని ధర్మాసనాన్ని కోరారు. గతంలో కూడా కోర్టు అనుమతి ఇచ్చిందని ఈ సందర్భంగా జగన్ తరపు లాయర్లు గుర్తు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 14కు వాయిదా వేసింది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article