తాజా వార్తలుఇడుపులపాయలో రెండు గంటల పాటు షర్మిల, సునీత చర్చలు

ఇడుపులపాయలో రెండు గంటల పాటు షర్మిల, సునీత చర్చలు

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆమె సోదరి, సునీత కలిశారు. ఇడుపులపాయలో ఆమె షర్మిలతో భేటీ అయ్యారు. సునీత కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు గంటల సేపు వీరు చర్చలు జరిపారు.హైదరాబాద్ నుంచి నేరుగా ఇడుపులపాయకు వచ్చిన సునీత.. షర్మిలతో భేటీ అయ్యారు. ముందుగా.. వైఎస్ఆర్ ఘాట్ దగ్గర వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ నుంచి షర్మిలతో కలిసి కడపకు రానున్నారు సునీత రెడ్డి.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article