తాజా వార్తలుశ్రీ కనకదుర్గమ్మ కు వెండి కవచం బహుకరణ

శ్రీ కనకదుర్గమ్మ కు వెండి కవచం బహుకరణ

బుట్టాయగూడెం: మండలంలోని రెడ్డి గణపవరం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు వెండి కవచాన్ని బహుకరించారు. ఆలయ వంశానుగత ధర్మకర్త భౌమరాజు ధనుంజయరాజు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి రెడ్డి గణపవరంకు చెందిన పెనుమత్స వెంకటరామరాజు, కీర్తి దంపతులు, నడిపల్లి నారాయణరావు, లక్ష్మీ దంపతులు సంయుక్తంగా అమ్మవారికి వెండి కవచాన్ని బహుకరించినట్లు తెలిపారు. సుమారు 1 6 కిలోల వెండితో తయారు చేయించి, బహుకరించిన వెండి కవచనాన్ని ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి అలంకరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article