*మీకు చేతులెత్తి మొక్కినా తక్కువే…
*పేరుకే మహిళా అధికారి అయినా…
*పురుష అధికారులకు పొరుషం ఉందా అన్నట్లుగా…
*నిధులు లేక పోయినా…
*విధుల నిర్వహణ లో సూపర్….
*పాడుబడుతున్న వాహనాన్ని ప్రయోజనం లోకి తెచ్చి…
*చక్కటి పందిరి లో ఉంచి…
*ప్రభుత్వ అధికారులంటే పద్దతి ఉండాలంటూ…
*జిల్లా కలెక్టర్ ను ఒప్పించి…మెప్పించి లే….
*సమస్యలు ఎదుర్కొంటూనే వాటిని సవాల్ గా స్వీకరించి….
*స్వీయ ధర్మం లో స్వయం తప్పిదం లేకుండా…
*సమాచార శాఖకు వన్నె తీసుక వచ్చేలా….
*బదిలీ తప్పదని తెలిసి కూడా….
*బాధ్యత పట్ల ఆశ్రద్ద చేయకుండా….
*అవినీతి ఆధికారులు సిగ్గు పడేలా చేసి…
*అందరికి కాక పోయిన కొందరికయిన ఆదర్శంగా నిలిచి…
*ఆడది అభల కాదు సభలనేలా…
*పద్మజా పనితీరే వేరయా…
(రామమోహన్ రెడ్డి)

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి ||
“ నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు ; ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు ; అలాగని కర్మలు చేయడం మానకు”అని భగవద్గీత లో చెప్పబడినది
.కర్మలను చేయడానికే మనకు హక్కు ఉంది !
కర్మలను సదా అప్రమత్తతతో చేస్తూ ఉండాలి !
ఎప్పుడూ “ కర్మిష్ఠి ”గానే ఉండాలి !
‘ అకర్మణ్యత్వం ’ అన్నది ఎప్పుడూ వుండకూడదు !
నెల మొత్తం పూర్తిగా పనిచేసిన తరువాతనే జీతం వస్తుంది …
ఫలితాన్ని తరువాతి నెలలోనే అనుభవించ గలుగుతాం.
దేనినైతే మనం “ధర్మం” అనుకుంటున్నామో ఆ ధర్మం నిర్వర్తిస్తూనే ఉండాలి.
ఆ రకమైన ధర్మ కర్మలు చేస్తూనే ఉండాలని గీతలో శ్రీకృష్ణ బాగవానుడు చెప్పియున్నారు.ఇలా ఎంతమంది తమ జీవిత ప్రయాణంలో ఆలోచన చేస్తారంటే అది సమాధానం దొరకని ప్రశ్న.కానీ కొంతమంది ఉన్నారని చెప్పడానికి సందేహం అక్కర్లేదు.
అందులో…
పని పట్ల నిబద్ధత, ఉద్యోగం పట్ల బాధ్యత విధుల్లో విధేయత ,వృత్తి పట్ల నిజాయితీ, ఉద్యోగ ప్రయాణం లో క్రమశిక్షణ ఉంటే సాధించనది ఏది లేదంటూ సమాచార శాఖలో ఎన్నో సవాళ్లు ఎదురైన స్థానికత అంటూ సమస్యలు సృష్టించబడతాయని అన్నా అవేమి లెక్క చేయక,నాకెందుకులే నా జీతం నాకు వస్తుంది గా అన్న ఆశ్రద్ద అలసత్వం లేకుండా ఆమెకు ఆ అవసరం లేదని చెప్పచ్చు ఉందని అనవచ్చు అలా తన ఉద్యోగ ధర్మం పాటించి పాడు బడబోయే ప్రభుత్వ వాహనాన్ని పక్కాగా రెడీ చేసి అందరితో కాక పోయిన కొందరితో శభాష్ అనిపించుకుంటూ ఉంది కడప మాజీ ఏడీ ప్రస్తుత కాకినాడ డిప్యూటీ డైరెక్టర్ పద్మజా.
ఎందుకయ్యా ఇంత అతిశయోక్తి అని అందరు కాక పోయిన కొందరు అనుకోవచ్చు.ఇక్కడ ఇప్పుడు ఈనాటి పరిస్థితులలో ఉద్యోగ ధర్మంలో బాధ్యత అనే పదానికి పెద్ద పీట వేసేవారు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. అందులోనూ పాడుబడడానికి సిద్ధంగా ఉన్న ఏ వస్తువులను తిరిగి బాగు చేయించి వాటిని వినియోగం లోకి తీసుకు రావడం అనేది కూడా ఒక నిబద్ధతతో కూడుకున్న అంశమనే చెప్పాలి.
ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సమాచార శాఖ గతానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో సమాచార శాఖలో బోలెడు నిధులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేవి ప్రస్తుతం అవన్ని కూడా ఆశించిన స్థాయిలో లేవని చెప్పచ్చు.అయినా కూడా తన పరిధిలో ఉన్న అంశంపై క్షుణ్ణంగా అవగాహన చేసుకుని తమ కార్యాలయం కు అతి ముఖ్యమైనది అనేక విమర్శలకు అవకాశం ఇవ్వనిది ఆది ఉంటే అలవోకగా అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుందనేది యదార్థం. అదే సమాచార శాఖ వాహనం.ముఖ్యంగా ఏ శాఖ లేని ఇబ్బందులు సమాచార శాఖకు కూడా కొన్ని ఉంటాయి.ఏ రాజకీయ పార్టీ అధికారం లో ఉన్నా మంత్రులు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మీడియా కవరేజ్ ఇవ్వాల్సిన బాద్యత ఆయా జిల్లా పరిధిలో ఉన్న సమాచార శాఖ అధికారులకె ఉంటుంది.అప్ప్పుడు జిల్లా కేంద్రంలో ఉన్న మీడియా సబ్యులకు వాహనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అదే ప్రస్తుతం ప్రధానంగా చర్చించుకుంటున్న స్వరాజ్ మాజ్డా వాహనాలు ప్రభుత్వం ఎప్పుడో కేటాయించింది కొన్ని జిల్లాల్లో మరమ్మతులకు నోచుకోక మూలన పడ్డాయి.కొన్ని జిల్లాల్లో ఇంకా ఉన్నాయి వేలాయుధం లాంటి అవినీతి అధికారులున్న చోట ఆ వాహనాలు పూర్తిగా పాడుబడి పోయి పాత సామాన్లకింద అమ్మేసే స్థాయికి చేరుకున్నాయి.
అయితే ఇక్కడ వేలాయుధం లాంటి అవినీతి అధికారులు బాద్యత పట్ల అలసత్వం వహించి నిధులు మంజూరు అయిన వినియోగం చేయక దుర్వినియోగం చేస్తే మహిళా అధికారి అయ్యి ఉండి జోన్ 4 లో అనేక సమస్యలు ఆమె ఎదుర్కొన్న ఆ జోన్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు ఉన్నప్పటికి వాహనం మరమ్మతులు చేయించక పోతే ప
పాడుబడి పోయి నిరుపయోగం అవుతుందని ఆ జిల్లా కలెక్టర్ ను నిధులు అడిగి అనుకున్న అంచనాలు పెరిగినా వెనుకడగు వేయకుండా అంచనాలు సవరించమని అడిగి అద్భుతంగా వాహనాన్ని తయారు చేయించి ఆ వాహనం ఎక్కడ తడుస్తుందోనని అంచనాలలో లేక పోయినా షేడ్ వేయించి ఆ జిల్లా సర్వోన్నతాధికారిని మెప్పించి ప్రశంసలు పొందింది పద్మజా అని చెప్పాడం లో పెద్దగా అచ్చర్య పడాల్సిన అవసరం లేదు.ఇలాంటి అధికారిణి కి ప్రమోషన్ లో మొదటి పేరు రేషియో ప్రకారం మొదటి పేరు ఉన్నా కాకినాడ కు బదిలీ …ప్రభుత్వ సొమ్మును ,సిబ్బంది సొమ్మును ఎలా తినాలో తెలిసిన వారికి అదే ప్రాంతంలోనే అందలం ఎక్కిస్తున్న ఈ అధికారుల తీరును చూస్తుంటే ఇది కదా అసలైన అధికారుల తీరని ముక్కున వేలేసుకుంటున్నారు ఆ శాఖలోని కొందరు అధికార యంత్రాంగం.అందుకే ఆమె సేవలను కొనియాడడం లో తప్పేమీ లేదని అనిపిస్తోంది.

