*లేక యమకింకరులా…
*పేదలంటే వీరికి చులకనా…
*మహిళలంటే మరింత హేళన…
*కాసులే ముఖ్యం కాగితాలతో పనిలేదు…
- భూకబ్జాదారులకే కొమ్ము కాసుకుంటూ..
*ఏ తహసిల్దార్ వచ్చినా ప్రజల్లో చులకన చేసేలా…
*చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందంగా
*చేతివాటం చూపిస్తున్న వీఆర్వోలు
విసిగిపోతున్న ప్రజలు
*ముడుపులు చెల్లిస్తే ఎలాంటి తప్పుడు డాక్యుమెంట్లకయిన రెడీ అంటూ - *పౌర సమాచార చట్టాన్ని కూడా తుంగలో తొక్కుతూ
- *ఏర్పేడు మండల సర్వేయర్ పనితీరుపై సోకిస్తున్న ప్రజలు
- మండల మేజిస్ట్రేట్ కే మాయని మచ్చ తెస్తున్నారా…
- రాజశేఖరా ఓసారి చూడలేరా వీరిని…
ప్రజాభూమి ప్రతినిధి తిరుపతి/ఏర్పేడు:
ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు, ప్రజా ప్రభుత్వాలు , అధికారుల తీరును చూసి విసిగి వేసారిపోయి ఒకనాటి ఆంగ్లేయుల పాలనను గుర్తుకుతెచ్చుకుంటారని స్వాతంత్ర్యము రాకమునుపే చక్రవర్తి రాజగోపాలాచారి చెప్పినది అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయని చెప్పడానికి సిగ్గుతో సోకిస్తుంది ఈ ప్రజానీకం. నవ్విపోదురు గాక నాకేల సిగ్గు అన్న చందాన నాలుగు రూపాయల కోసం నమ్మి వచ్చిన నిరుపేద ప్రజల పట్ల నిర్లక్ష్యం, ఆశ్రద్ద, అవమానకర రీతిలో చూస్తున్న ఈ అవినీతి అధికారులు వీరికి అండగా ఉన్న నేతలను చూసి నేల తల్లి నిలువునా దహించి పోతుందని చెప్పడంలో తప్పులేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్న దళితుల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతుందంటే పేద బడుగు బలహీన వర్గాల ,అణగారిన, అభివృద్ధి కి నోచుకోని అభాగ్యులెందరు ఈ అవినీతి తిమింగలాల మధ్య బ్రతికి బట్ట కట్టడం సాధ్యమా అన్న ప్రశ్న అణగారిన వర్గాలోంచి పుట్టుక రావడం తప్పేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఇలాంటి పరిస్థితి నెలకొన్న గ్రామం మండల ఎక్కడ ఎందుకు ఏమిటీ ఎలా అనే వివరాలలోకి వెళితే…అది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం.పేదల పాలిట దేవుడిలా కనిపించే వెంక టేశ్వరుడి నామ ద్యేయం కలిగిన వెంకటేశ్వర్లు జిల్లా సర్వోన్నతాధికారి గా ఉన్న తిరుపతి జిల్లా లోని జిల్లా కేంద్రంకు కూతవేటు దూరం లో ఉండే ఏర్పేడు మండలం. ఈ మండలానికి ఏ తహసీల్దార్ వచ్చినా అక్కడే తిష్ట వేసి ఉన్న ఒక అవినీతి ముఠా ఆటలో ఆడాల్సి ఉంటుంది.అలా కాదని భిన్నంగా పోయారా ఒక విఆర్వో కి ఒక పార్టీ నాయకుడు అండ దండ, ఇక మండల సర్వేయర్ కు అయితే అందరూ అండగా ఉండి తీరాల్సిందే .ఇక వీరకి డిప్యూటీ తహసీల్దార్ నాయకత్వ. ఇలా ఈ ఏర్పేడు మండల పరిస్థితి అని ప్రజలలో ఒకటే చర్చ సాగుతోంది. కారణం*ఈ మండలంలో ఎండి పుత్తూరు గ్రామానికి చెందిన పుత్తూరు బత్తెమ్మ అనే ఎస్సీ మహిళను తన పొలం విషయంలో రెవెన్యూ కార్యాలయం చుట్టూ కొన్ని సంవత్సరాలు తరబడి తిప్పుకుంటూ కాలయాపన చేస్తూ..ఇదే విషయంపై సాక్షాత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ని కూడా కలిసి అర్జీలు ఇచ్చినా న్యాయం జరగలేదని దీనికి అంతటికి కారణం మండల సర్వేర్ కి మండల డిప్యూటీ తాసిల్దార్ కి విఆర్ఓకి మూడు లక్షలు డబ్బులు అడిగారని ఇస్తేనే తన పని చేస్తామన్నట్లు సదరు మహిళ వాపోతుంది.బాధిత మహిళ బాధ విన్న ఆర్డిఓ నేరుగా పొలం వద్దకు వచ్చి సర్వే చేసి జెండాలు నాటి వెళ్ళి తన పొలాన్ని తనకు కేటాయిస్తమని అన్న తర్వాత కూడా స్థానిక సర్వేయార్ తన పొలాన్ని తనకు కేటాయించకుండా జాప్యం చేస్తుంటే నాలుగు నెలలు మండలం చుట్టూ తిరిగిన గాని ఫలితం లేకపోవడంతో తిరుపతి జిల్లా కలెక్టర్ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగిందని బాధితమహిళ వాపోయింది. తిరుపతి జిల్లా కలెక్టర్ విఆర్ఓ కి ఫోన్ చేసి తన పొలాన్ని తన పేరుతో చేసి ఇవ్వమని చెప్పడం జరిగిందని అయినా కూడా మండలంలో పట్టించుకోక పోగా ఈ మధ్యకాలంలో తాసిల్దారులు బదిలీలపై వెళ్లడంతో కొత్తగా వచ్చిన తాసిల్దార్ రాజశేఖర్ ప్రతి పేదవాడికి పని చేయమని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పై అధికారుల మాటలు ధిక్కరించిన వారిలో మండల సర్వేయర్ అదే విధంగా మండల డిప్యూటీ తాసిల్దార్ ,విఆర్ఓ లేనని బాధిత మహిళ ఆవేదన వ్యక్తంచేస్తోంది.వచ్చిన ప్రతి ఎమ్మార్వో ని కలిసి ఆమె కన్నీటీ పర్యంతం అవ్వడమే ఆమె పనయిందని వాఫోతుంది.ఆమె మండలానికి వెళ్ళిన ప్రతిసారి తనను చూసి హేళన చేస్తూ మనోవేదనకు గురి చేస్తున్నారని దిక్కు ఉన్న చోట చెప్పుకోవచ్చన్న విధంగా తనను కించపరిచి మాట్లాడడం మానసికంగా బాధపడుతున్నానని ఆమె బాధాకరం వ్యక్తం చేసింది.ముఖ్యంగా మండలంలో పై స్థాయి అధికారులు పనితీరు చాలా చక్కగా ఉందని అయితే ఈ ముగ్గురి వలన తాను మనోవేదనకు గురవుతున్నానని 14 సంవత్సరాలు తిరిగి ఆరోగ్యం కూడా క్షీణించి ఆయుస్సు కూడా పోయే స్తితికి వచ్చిందని ఈ ముగ్గురు అధికారులే బాధ్యత వహించాలని ఆమె బాధను వెళ్ళబోసుకున్నారు. 14 సంవత్సరాలుగా తాను తిరుగుతున్నప్పటికీ ఈ విధంగాతనని ఈ విధంగా ఈ ముగ్గురు అధికారులు చూసిన విదంగా ఎప్పుడు ఏ అధికారి కూడా హేళన చేసి మాట్లాడలేదని ఇప్పుడు వచ్చిన ఈ అధికారులు కేవలం డబ్బు ఇవ్వలేదని నెపంతో కించపరిచి మాట్లాడడం జరుగుతుందని పై అధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి తనలాంటి బాధ మరొకరు అనుభవించకూడదని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు.ప్రజలు కష్టార్జితంతో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు ప్రజలకు మంచి చేయాలే తప్ప ప్రజలను చూసి అవహేళన చేయకూడదని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీరి ముగ్గురిపై మునుముందు మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. పై అధికారులు ఆమెను డబ్బులు అడిగినప్పుడు తాము డబ్బులు అడిగినట్టు ఆధారాలు చూపించిన తర్వాతే మాట్లాడే విదంగా బెదిరిస్తున్నారని ఆమె తెలియజేశారు. అయినా కూడా సాధారణమైన ప్రజలను ఒక అధికారి డబ్బులు అడిగేటప్పుడు ఎలా చూపించగలమని ఆమె ప్రశ్నించారు. 14 సంవత్సరాలు తాను తిరిగేటప్పుడు కూడా ఇలాంటి అధికారులు ఎప్పుడు తనకు కనబడలేదని ఇంత నీచంగా మాట్లాడుతూ చేతనైంది చేసుకో అని చెప్పిన అధికారులను వీళ్ళ ముగ్గురిని చూస్తున్నానని ఇలాంటి అధికారులు వలన ప్రజలు కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తారని దయచేసి ఉన్నతాధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని ఇక తిరిగి విసిగి వేసారి పోయానని ఇక నాకు ఆత్మహత్య శరణ్యమని ఆమె ఆవేదనను వ్యక్తపరిచారు.ఇంతటి దారుణానికి ఒడిగట్టి తనని హేళన చేసిన ఈ ముగ్గురి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే మానవ హక్కుల కమిషన్ కి. అలాగే రాష్ట్రపతికి తన గోడు విన్నవించుకుంటానని బాధిత మహిళ పుత్తూరు బత్తెమ్మ ఉన్నతాధికారులను వేడుకొంటోంది.చూడాలి మరి జిల్లా సర్వోన్నతాధికారి స్పందిస్తారా లేదా అన్నది.

