తాజా వార్తలుదశరథ బాబుతోనే మంగళగిరి దశ మారనుందా..!

దశరథ బాబుతోనే మంగళగిరి దశ మారనుందా..!

*ప్రజాసేవే అతని ఊపిరి
*పేద ప్రజలకు అండగా ఉండడమే అతని ఆశయం
*టీడీపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మకం
*ప్రతిపక్ష పార్టీల నుంచి పిలుపు ఉన్నా…
*శ్వాస ఉన్నంత వరకు టీడీపీ పార్టీతోనే అంటూ..
*టీడీపీ జెండానే అతని అజెండా అంటూ…
*రాజధాని ప్రాంత అభివృద్ధి లో భాగస్వామ్యం అవ్వాలని ఆశతో…
*అధిష్టానం ఆశీస్సులే తరువాయి…
*అన్ని ప్రణాళికలు సిద్ధంగా ఉంచుకుని…
*ఎన్నికల గడువు కోసం గడియలు లెక్కిస్తూ…
*గుండెల్లో గుబులు లేకుండా … గెలుపుపై గురిపెట్టి…
*దశరధునికి దండ,అండ లభిస్తుందా…
ప్రజాభూమి ప్రతినిధి అమరావతి: దశరథ బాబు తోనే మంగళగిరి దిశ దశ తిరగబోతుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి ఆ ప్రాంతంలో. నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతంకు అనుసంధానం గా ఉన్న మంగళగిరి కి జరగబోవు మున్సిపల్ ఎన్నికలలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గా తెలుగు దేశం పార్టీ నుండి ఆశావాహుల్లో రామావత్ దశరథబాబు మొదటి స్థానం లో ఉన్నారు.ఉన్నత విద్యావంతుడు ఉపాధ్యాయ వృత్తి నుంచి గ్రూప్1లో మెరిట్ సాధించి ట్రెజరీ , రాష్ట్ర పోలీస్ కార్యాలయం,నేడు సమాచార ,పౌర సంబంధాల శాఖ లో అకౌంట్స్ డిపార్ట్ మెంట్ లో విశేష సేవలు అందిస్తున్న దశరథ బాబు ప్రజా సేవ కోసం,తన ఆశ శ్వాస,ద్యాస,తన పార్టీ టిడిపి యే ఊపిరి గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఆదర్శంగా తీసుకుని యువ నాయకుడు భావి ముఖ్యమంత్రి నారా లోకేష్ ఆశయ సాధనలో అడుగులో అడుగులు వేస్తూ అన్ని వర్గాల ప్రజలే అభివృద్ధే నినాదంగా ముందుకు సాగుతున్న దశరథ బాబు ప్రజా సేవకు ఇక తన జీవితాన్ని అంకితం చేయాలని అనేక రకాల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం జరుగుతుంది. సమాజం లో నానాటికి పెరుగుతున్న ఆర్ధిక అసమానతలపై చక్కటి భవిష్యత్ కార్యాచరణ కలిగి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏమి చేస్తే బావి భారత పౌరులుగా, వెనుకబడిన తరగతులు ముందు కి దూసుకెళ్లి ఈ సమాజంలో అన్నింటిలో రాణిస్తారన్న విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారు రామావత్ దశరథ బాబు.తన రాజకీయ ప్రస్థానాన్ని ఎంతో ఉన్నతంగా ఉండాలని అనుకున్నా మొదట గా అంతర్జాతీయ స్థాయిలో నిర్మితం అవుతున్న రాజధాని అమరావతి లో తన తొలి అడుగు వేసి అమరావతి అభివృద్ధి లో భాగస్వామ్యం అయితే అదొక మైలురాయి గా చరిత్ర పుటల్లో లిఖించబడుతుందని ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే గా నిలబడి ఆపై లోకేష్ మంత్రివర్గంలో చోటు దక్కించుకుని రాష్ట్ర స్థాయిలో తన విశేష అనుభవంతో పేద ప్రజల ముఖ చిత్రాన్ని మార్చే అబ్దుతమైన వ్యూహ రచనలు చేసి పేదరికం లేని సమ సమాజ స్థాపన చేసి తన ఊపిరి ఉన్నంత వరకు టీడీపీ పార్టీతోనే ఉంటూ తుది శ్వాస విడవాలని దశరథ బాబు దృఢంగా నిశ్చయించుకున్నట్టు ఆయన అభిమాన సంఘం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.చూడాలి మరి దశరథ బాబు దశ ఎటు వైపు అడుగులు వేస్తుందో.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article