తాజా వార్తలునా వాళ్లపై చేయి వేస్తే నాపై వేసినట్లే - ఇక్కడే ఉంటా, ఎవరొస్తారో రండి :...

నా వాళ్లపై చేయి వేస్తే నాపై వేసినట్లే – ఇక్కడే ఉంటా, ఎవరొస్తారో రండి : వైఎస్ జగన్ హెచ్చరిక

పులివెందులలోనే ఓటేస్తా, కాలర్ ఎగరేసి చెప్తున్నా ఖబర్దార్ – రిటైరై సప్త సముద్రాలు దాటినా వదిలిపెట్టను

పులివెందులలో మోగించే మోత రాష్ట్రమంతా వినిపించాలి –

నాయకులకు,కార్యకర్తలకు జగన్ పిలుపు

ప్రజాభూమి, పులివెందుల:
పులివెందుల రెండు రోజుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం పులివెందులకు చేరుకున్నారు. హెలిప్యాడ్ నుండి ఆడిటోరియంకు చేరుకుని నాయకులు, కార్యకర్తల ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ – మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, నా వాళ్లపై చేయి వేస్తే నాపై వేసినట్లే, పులివెందులలోనే ఉంటా, ఎవరొస్తారో రండి తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. తన పార్టీ కార్యకర్తపై దెబ్బ పడితే చూస్తూ ఊరుకోనని, మీ మీద పడ్డ దెబ్బను మీ అన్న చూస్తూ ఊరుకోడని స్పష్టం చేశారు.

పోలీసులపై ఫైర్ అయిన జగన్:
రక్షకులుగా ఉండాల్సిన పోలీసులే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు వెళ్తున్న వైకాపా నాయకులను అడ్డుకోవడం, లాఠీచార్జ్ చేయడం, భాష్పవాయువు ప్రయోగించడం, ఏకే-47తో 37 రౌండ్లు కాల్పులు జరపడం దారుణమన్నారు. ఈ కాల్పుల్లో రామిరెడ్డిపల్లెకు చెందిన వ్యక్తికి, హఫీజ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయన్నారు.924 మందిపై 307 కేసులు పెట్టి ఎన్నికల రోజు ఊర్లో లేకుండా చేయాలని చూడటం ఏంటని ప్రశ్నించారు. టోపీపై ఉన్న మూడు సింహాలను చూసి డ్యూటీ చేయండి, మీరు డ్యూటీ చేసేది చంద్రబాబు కోసం కాదు, ప్రజాస్వామ్యం కోసం చేయండి అని పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అన్యాయం చేసిన ఏ అధికారినైనా రిటైరైనా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టనని, మా సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు.

పులివెందులలోనే ఉంటా
మున్సిపల్ ఎన్నికల రోజున ఓటు వేసేందుకు తాను పులివెందులలోనే ఉంటానని, చొక్కా మడత వేసి చెబుతున్నానని, ప్రజలు తమ ఓటును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.పులివెందులలో కొట్టే దెబ్బకు రాష్ట్రమంతా సౌండ్ రావాలని, ఇక్కడ మోగించిన మోత రాష్ట్రమంతా వినిపించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పులివెం దుల చైర్మన్ అభ్యర్థిగా వైఎస్ ప్రమీలమ్మను, 20 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కలెక్టర్, ఎస్పీలో మార్పు రాలేదని, వైకాపా పుట్టింది కష్టాల్లోనే, పెరిగింది కష్టాల్లోనేనని, మీరు తోడుగా నిలబడ్డారు కాబట్టే నేను సీఎం అయ్యానని జగన్ అన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్లో తన పాదయాత్ర ప్రారంభమవుతుంద ని, 2029లో జగన్ 2.0 వస్తుందని, ఈ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article