*అమరావతి పై భిన్నాభిప్రాయాలు..
*ముఖ్యమంత్రి ది అమరావతి బాట…
*జగన్ ది నాడు మూడు రాజధానులు..నేడు మావిగన్ బాట…
*అమరావతి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు చంద్రబాబు
*మూడు రాజదానులు పోయి మావిగన్ అంటున్నారు జ’గన్’
*33వేల ఎకరాల నుంచి మరో యాబై వేల ఎకరాల విస్తీర్ణం కు ప్రణాళికలు..
*భూసేకరణ కు సిద్ధమవుతున్న వేల…
*జగన్ తో అమరావతి రైతుల భేటి…
*అంతుచిక్కని చిదంబర రహస్యం లా అమరావతి నిర్మాణాలు..
*అయోమయంలో ఆంధ్రా ప్రజలు…
*రెండేళ్ల పాలన ముగుస్తున్నా రాజధాని పై ఆగని రగడలు…
*అమరావతి రైతులకు నిజంగా అన్యాయం జరుగుతూ ఉందా…
*అమరావతి రైతుల్లో అలమరికలు ఉన్నాయా…
*కూటమి పాలనపై నమ్మకం సన్నగిల్లిపోతుందా…
*రాజధాని పై రాజపత్రం వచ్చినా కూడా…
*రాజధాని మార్పు సాధ్యం అవుతుందా…
*ప్రభుత్వం మారితే మళ్ళీ పిచ్చి మొక్కలు కనిపిస్తాయా..
- ఆంధ్రుల రాజధానిపై ఆందోళన తప్పదా…
*ఇవన్నీ ప్రజా ప్రయోజనాల కోసమా…
*పార్టీల మధ్య కుదరని సయోధ్య కోసమా…
*అంతులేని కథలా అమరావతి అవుతుందా..
*ఓరి ఆంధ్రుడా ఆలోచించరా అమరావతి పై…
(రామమోహన్ రెడ్డి)
రాజధాని అనగా దేశం, ప్రాంతం, రాష్ట్రం మొదలైన వాటి పరిపాలన శాఖలు ప్రధానంగా ఉన్న పట్టణం లేదా నగరం. రాష్ట్ర లేదా దేశ రాజధాని పరిపాలన కొరకు సాధారణంగా మహా నగరపాలక సంస్థ ఉంటుంది. ఒక నగరాన్ని రాజధానిగా పేర్కొనడం రాజ్యాంగం ద్వారా, చట్టం ద్వారా జరుగుతుంది. కొన్ని దేశాలకు, ప్రాంతాలకు అధికారిక రాజధాని ఉన్నా, ప్రభుత్వ పాలన కేంద్రం వేరేగా వుండటానికి అవకాశం ఉంది.
చట్టం (Law) అనేది ఒక సమాజంలో క్రమశిక్షణను కాపాడటానికి, పౌరుల హక్కులను రక్షించడానికి మరియు న్యాయాన్ని చేకూర్చడానికి ప్రభుత్వం లేదా పాలక వర్గం ద్వారా నిర్దేశించబడిన నియమాల సమితి. ఇది ప్రజల ప్రవర్తనను క్రమబద్ధీకరిస్తుంది మరియు సమాజంలో అందరికీ సమానత్వాన్ని ఇస్తుంది. చట్టాలను అధికారికంగా ప్రభుత్వాలు (లేదా పార్లమెంటు/శాసనసభలు) ఆమోదిస్తాయి.
ఇది సాధారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఉన్న నియమ నిబంధనలు కానీ ఒక్క నవ్యాంధ్రప్రదేశ్ మాత్రమే రాజకీయ పార్టీల మధ్య ఉన్న వైషమ్యాలతో రాజధాని అమరావతి పై రగడ అనేది అంతుచిక్కని చిదంబర రహస్యం లాగా మారింది.ఈ రాష్ట్రాన్ని అనేకమంది ప్రముఖ నాయకులు పాలకులు గా ఉన్నారు.కానీ నేటి నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు పరిమితి దాటి ప్రజా స్వామ్య విఘాతం కలిగించే విదంగా ఉన్నాయా అన్న అనుమానాలు రేకెత్తించే విదంగా తయారు కావడం నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న నేటి ఖర్మనా అన్న భావన కలుగుతుంది. కారణం టిడిపి వైసిపి అధినేత ల మధ్య తలెత్తిన అంతర్యుద్ధం కారణంగా ఈ రాష్ట్రంలో అనేక రకాల రాజకీయ విభేదాలు ఏర్పడుతున్నాయని చెప్పక తప్పడం లేదు. అసలు ఈ రెండు పార్టీల అధినేతలు నిజంగా ప్రజా సమస్యలపై ,ప్రజలకొరకు ప్రజాహితం కోరి పంతానికి పోతున్నారా లేక వ్యక్తిగత భావజాలంతో ముందుకు సాగుతున్నారా అంటే భిన్నమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాలుగు పదుల సంవత్సరాల రాజకీయ అనుభవం అటు ముఖ్యమంత్రి గా,ఇటు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానం కొనసాగింపు ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తనయుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక పెద్ద వ్యాపార రాజకీయ వేత్తగా పరిణతి చెంది సొంత మీడియా ఏర్పాటు చేసుకున్న నేపధ్యంలో వైఎస్సార్ అకాల మరణం జగన్ కాంగ్రెస్ పార్టీని విభేదించి ఓదార్పు యాత్ర ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఇలా ఉన్న తరుణంలో అక్రమాస్తుల కేసులో జైలు కెళ్లడం,రాష్ట్ర విభజన జరగడం బైటికి రాగానే ప్రత్యక్ష రాజకీయాలలో వచ్చి బలమైన ప్రతిపక్ష నేతగా ఎడగడం వైసీపీ ఎమ్మెల్యేలు 23 మందిని టిడిపిలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చి జగన్ పై అసెంబ్లీ సాక్షిగా విమర్శ,ప్రతివిమర్శ లతో కూడిన రాజకేయ యుద్ధ వాతావరణం ఏర్పడడం జగన్ పాదయాత్ర మొదలు పెట్టడడం 151 సీట్లతో ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రతిపక్ష నేత ను అనుయాయులు గా ఉన్న వారి పై కేసులు పెట్టి జైలు కు పంపడం అప్పట్లో నే అమరావతి రాజధాని ఏర్పాటును వ్యతిరేకంగా మూడు రాజధానుల పేరిట వికేంద్రీకరణ కోసం పోరాటం చేయడం కేంద్రం రాష్ట్ర పరిస్థితులపై స్పష్టమైన వైఖరి వెల్లడించక పోవడం అమరావతి రైతుల ఉద్యమం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈ ఇద్దరు అధినేతల మధ్య రాజకీయ పరమైన అంశాల కంటే వ్యక్తిగత దూషణలు, ఆఖరికి ఎవరికి వారు వారి వారి కుటుంబాలను సైతం రోడ్డుకు ఈడ్చే పరిస్థితి తెచ్చుకుని ప్రజాక్షేత్రం లో నిలబడి పోయారన్నది నవ్యాంధ్రప్రదేశ్ ప్రజల్లో బాగా నాటుకుపోయింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏర్పడిన రాజకీయ పరిస్థితి చూస్తే తమిళనాట ఒక నాడు అధికారం లో ఉన్న వారు ప్రతిపక్ష పార్టీని జైలుకు పంపే సంస్కృతి ఉండేది. అది కాస్త అక్కడ సర్దుబాటు అయ్యి వైఎస్ జమాన నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదలైన రాజకీయ వైరుధ్యాలు నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భావం తరువాతి అవి తారాస్థాయికి చేరాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భావం తరువాత అప్పుల్లో, రాజదాని లేని రాష్ట్రానికి నిధులు నియా మకాలు ఇచ్చి ఆదుకోవాల్సిన కేంద్రం మట్టిని ఇచ్చి చేతులు దులుపుకోవడం కారణంగా రాజదాని నిర్మాణం కోసం బంగారు పొలాలను ఇచ్చిన రైతుల ఆశల ఆడియాసలు అవ్వవడమే కాకుండా ప్రపంచ స్థాయి రాజదానిగా నిర్మించాలన్న ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం కు నిధుల కొరత ఏర్పడింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన అమరావతి నిర్మాణం పై ఆనాడు ఈనాటి మాటే అనడం రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్రప్రదేశ్ మిగిలిపోయింది.గత సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీఏ కూటమి సారధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన ఉన్నా కేంద్రం అమరావతి కి చట్టబద్దత కల్పిస్తూ రాజపత్రం జారీచేసిందే తప్ప అమరావతి నిర్మాణం కోసం కనీసం అవసరమైన మేర కాక పోయిన అమరావతి రూపురేఖలు మారడానికి నిధులు కేటాయింపు చేయడం లేదు. ఇలా అమరావతి నిర్మాణం పురిటి నొప్పులు భరించి ప్రసవవేదన నుండి బైటికి వచ్చే లోపు ముఖ్యమంత్రి ఇప్పుడున్న 33 వేల ఎకరాల భూమి సరిపోదని మరో 50 వేల ఎకరాల భూ సమీకరణకు ముందుకు సాగడం ఇక అమరావతి ఆగడం ఖాయమనే భావనను ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో కి బలంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు మూడు రాజధానులు ప్రతిపాదనలు పక్కన బెట్టిన ప్రతిపక్ష .నేత జగన్ మావిగన్ అనే కొత్త కోణాన్ని తెరమీదికి తీసుకుని వచ్చి నవ్యాంధ్రప్రదేశ్ ప్రజల్లోకి అమరావతి నిర్మాణం అనేది అనకొండ లాంటిదని ప్రతిపాదనలు చేస్తుండడంతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శ ప్రతివిమర్శ లనేవి ప్రజాహితం పరిధి దాటి పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ కే ప్రమాదం పరినమిళ్లేంత స్థాయికి చేరిపోతున్నాయి.ఈ నేపధ్యంలో రాజధాని ప్రాంతంలో ఉన్న కొంతమంది వైసీపీ సానుభూతి పరులు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం కలిసి అమరావతి భూముల విషయంలో తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడం మండే అగ్గికి ఆజ్యం పోసినట్టు అయ్యిందిగా అన్న ఆలోచన ప్రజల్లో నుంచి పుట్టుకొస్తుంది.రెండేళ్ళ కూటమి పాలనలో క్వాంటం ,అంతర్జాతీయ బ్యాంకుల ఏర్పాటూ,ఏఐ టెక్నాలజీకి ఇలా ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన సంస్థలు ఏర్పాటు ఓ వైపు ముందుకు సాగుతూ ఉండగా ఇలా రాజకీయ పరమైన విభేదాలు స్థాయి మించి పోవడం ఈ రాష్ట్ర ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి దాపురించక పోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మార్పు వైపు అడుగులు వేస్తే అమరావతి నిర్మాణం అనేది అంపసయ్యకు చేరి నేడు సుందరీకరణకు చేరవుతున్నది పిచ్చి మొక్కలతో దర్శనం ఇస్తుందా అన్న భిన్నమైన భావజాలం ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయే భాగస్వామ్యం లో ఉన్న కూటమి ప్రభుత్వానికి కేంద్రం నిధులు కేటాయించి అమరావతి అభివృద్ధికి అండగా ఉండక పోతే భావితరాలకు రాజధాని
అమరావతా లేక మావిగన్ నా అన్న ఆలోచన లో పడక తప్పదు.చూడాలి ఆంధ్రుల అమరావతి చివరికి ఎలా పరిభ్రమణం చెందుతుందో….

