సాహిత్యంఅంగరంగ వైభవముగా శ్రీ కళ్యాణవెంకన్నరథోత్సవం.!

అంగరంగ వైభవముగా శ్రీ కళ్యాణవెంకన్నరథోత్సవం.!

భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు..
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణవేంకటేశ్వర స్వామివారిబ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైనగురువారం ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ర‌థాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం 8 గంటలకు శ్రీ భూ స‌మేత క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీ‌వారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చ‌కులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఇ నాగేశ్వరావు, ఇఇలు ప్రసాద్, సుమతి, వేణు గోపాల్, డెప్యూటీ ఇఇలు హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌రెడ్డి, దామోదరం, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈ కార్యక్రమం లో వరలక్ష్మి, విజివో బాలిరెడ్డి, ఏఈవో గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఏఇ చంద్ర శేఖర్, సూపరింటెండెంట్లు చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చ‌కులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article