తాజా వార్తలుఅంగన్వాడీలపై జగన్ రెడ్డి తీరు పిరికిపంద చర్య: అచ్చెన్నాయుడు

అంగన్వాడీలపై జగన్ రెడ్డి తీరు పిరికిపంద చర్య: అచ్చెన్నాయుడు

ప్రజాస్వామ్య పద్దతిలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఉక్కుపాదం మోపడం జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు, పెత్తందారీ పోకడలకు పరాకాష్ట అని అచ్చెన్నాయుడు అన్నారు.తన నివాసాన్ని ముట్టడిస్తారనే భయంతో జగన్ రెడ్డి అంగన్వాడీలు తలపెట్టిన చలో విజయవాడను అడ్డుకోవడం పిరికిపంద చర్య అని న్యాయమైన డిమాండ్ల పరిష్కరం కోసం 40 రోజులుకు పైగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం, విధుల నుంచి తొలగించడం,వేతనాల్లో కోత పెట్టడం, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు దుర్మార్గమన్నారు. జగన్ రెడ్డి నియంత అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?సమ్మెకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన తెలుగునాడు అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీతను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. పోలీస్ వ్యానులో ఇష్టమొచ్చినట్టు తిప్పుతున్నారు. .ఇష్టానుసారం వ్యవహరించడానికి రాష్ట్రం జగన్ రెడ్డి జాగీరా? ఒక్కో అంగన్వాడీ కార్యకర్త అపరకాళిగా మారి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని భస్మంచేయడం ఖాయమని దుయ్యబట్టారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article