తాజా వార్తలుఅంగన్వాడీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు : రేవంత్ రెడ్డి

అంగన్వాడీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు : రేవంత్ రెడ్డి

సచివాలయంలో మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అంగన్‌వాడీల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, బయోమెట్రిక్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు.కేంద్రాలకు సొంత భవనాలు ఉండేలా చూసుకోవాలన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article