తాజా వార్తలుబెంగళూరు రేవ్‌ పార్టీ.. డ్రగ్స్‌ టెస్ట్‌లో 86 మందికి పాజిటివ్‌..

బెంగళూరు రేవ్‌ పార్టీ.. డ్రగ్స్‌ టెస్ట్‌లో 86 మందికి పాజిటివ్‌..

బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్‌ టెస్టులో మొత్తం 86 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు నార్కోటిక్‌ టీమ్‌ తెలిపింది. మొత్తం 106 మంది రక్త నమూనాలను నార్కోటిక్‌ టీమ్‌ సేకరించగా.. అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాలో డ్రగ్స్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా నటి హేమకు కూడా పాజిటీవ్‌గా నిర్ధరాణ అయినట్లు సమాచారం. రక్త నమూనాలు పాజిటివ్‌గా తేలిన వారందరికీ సీసీబీ సమన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ‘సన్‌ సెట్‌ టు సన్‌ రైజ్‌ విక్టరీ’ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీ జీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో గత ఆదివారం రేవ్‌పార్టీ నిర్వహించిన రేవ్‌ పార్టీని పోలీసులు భగం చేసిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article