టాప్ న్యూస్శభాష్ వేలాయుధం...!

శభాష్ వేలాయుధం…!

వేలాయుథానికిముఖ్యమంత్రి కూడా రుణ పడాలి…

కుప్పం లో వైసీపీ ఎమ్మెల్సీల ను పాల్గొనేలా చేసినందుకు..
*కేవలం సమాచార డీడీ మాత్రమే వైసిపి వారిని సీఎం పక్కన చేర్చారు…
*ఇతను సమాచార అధికారినేనా అన్న అనుమానం వస్తోంది..
*సమాచార అధికారికే వార్తలు రాయడం రాదా…
*వాహనాల రిపేరు డబ్బులు దోచుకోవడం బాగా తెలుసా…
*రిపేరు పేరుతో ఉద్యోగుల జేబులు కొట్టడం తెలుసుకానీ..
*ముఖ్యమంత్రి కరరేజ్ చేతకాక పోయే..
*అధికార పార్టీలో వైసీపీ వారిని ఈయనే చేర్చాడా..
*సిగ్గుపడాలి ఇలాంటి అధికారులను చూసి..
*ఇది జర్నలిజం నవ్వుల పాలయ్యదే…
*జిల్లా డీడీ అయి ఉండి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని అపహాస్యం చేస్తారా…
*అశ్లీల వీడియోలు ఫార్వర్డ్ అయినా చర్యలే లేనప్పుడు.
*సత్యసాయి జిల్లాలో వాహనాన్నీ నాశనం చేయగా…
*ముఖ్యమంత్రి ఒక లెక్కనా …
*ఇలాంటి అధికారులను వెనకేసుకొస్తున్న వారెవరో..
*ఆర్జేడీ ఉన్నాడంటే జీతం ఒకచోట…ఉద్యోగం ఒకచోట..
*జోన్ 4 ఆర్జేడీ ఆయనొక అభినవ అంబేద్కర్…
*వార్తలు రాసినందుకు అక్రెడేషన్ కార్డులు ఆపుతారు…
*ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలో అవమానాలు చేస్తారు…
*వీరితో ప్రజలకు సమాచారం చేరేది…
*నవ్వుకుంటున్నారు ఈ నాటకీయ అధికారులను చూసి…
*డైరెక్టర్ కస్టం వృదా చేస్తున్నది వీరే…
*ఇకనైనా వీరిపై చర్యలు ఉంటాయా.. ఊహూ అంటారా..
*ముఖ్యమంత్రి గారు మీరే ఆలోచించండి..
(రామమోహన్ రెడ్డి)
. నవ్విపోదురుగాక నాకేల సిగ్గు అన్న చందంగా సమాచార శాఖ అధికారుల తీరు ఉందంటే పక్కున నవ్వుతోంది నేటి సమాజం. కేవలం తమ స్వార్థం కోసం జీతాలు ఒక చోట బాధ్యతలు ఇంకొక చేస్తూ తాము అనుకున్నదే జరుగుతుంది అడిగేవారెవరు అన్న రీతిన ఉన్న ఈ సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ లు, రీజినల్ జాయింట్ డైరెక్టర్ లున్నంత వరకు ఆఖరి ముఖ్యమంత్రి పర్యటన ను కూడా అభాసుపాలు అవ్వడం సహజమే అన్న వాస్తవాలు లేకపోలేదు. సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజవర్గ పరిధిలో దశాబ్దాల తరబడి కృష్ణా జలాల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న తరుణంలో అపర భగీరథ ప్రయత్నం లాగా దాదాపు 800 కిలో మీటర్ల పైగా శ్రీశైలం నీటిని కుప్పం కు తరలించి ఆ ప్రాంతం సుభిక్షం చేసేందుకు వెళ్లి వేలాది మంది రైతుల హర్ష ధ్వానాల మధ్య కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి పూజలు చేసిన కార్యక్రమం లో వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం,కృష్ణ రాఘవ జయేంద్ర భరత్, పెద్దిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు ఇక్కడ బహుశా పర్వతరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి కావచ్చు నేమో ఇలా వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినట్లు చిత్తూరు అధికారిక వాట్సప్ గ్రూపులలో ఈ నెల 22వతేదిన మీడియాకు విడుదల చేయడం జరిగింది.కొన్ని పత్రికలలో అదే వార్త కూడా ప్రచురితం అవ్వడం కూడా జరిగింది.అయితే నర్మ గర్భంగా ఓ సత్యం దాగి ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అవేమిటంటేముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హంద్రీనీవ జలాలకు పూజలు చేసిన విషయం వాస్తవమే.కానీ ఆయన ఆ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.కానీ అత్యుత్సాహంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు వార్తలు ఇచ్చి అందులో వైసీపీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారని ఇవ్వడం వెనుక ఆ వార్త గత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అదే హంద్రీ నీవా జలాలకు పూజలు చేసిన సందర్భంగా అప్పట్లో మీడియాకు విడుదల చేసిన సమాచారమే ప్రస్తుతం చిత్తూరు జిల్లా సమాచార శాఖ అధికారి,గతంలో సత్యసాయి జిల్లాలో వాహనాల రిపేరుతో ప్రభుత్వ సొమ్మును కాజేసి,వాహనం రిపేరు పేరుతో కింది స్థాయి ఉద్యోగుల నుంచి అక్రమంగా డబ్బులు గుంజుకుని అటు వాహనం రిపేరు చేయకుండా షెడ్డు పాలు చేసి,ఇటు తీసుకుం డబ్బులు ఇవ్వకుండా ఉన్న తీరు అధికారుల విచారణ జరిపితే బట్టబయలు అయి ఆ అధికారి అవినీతి ఒక పుస్తకం అంతా ఉన్నా ఆ అవినీతి పై గత ఐదు సంవత్సరాలుగా అనేక మార్లు పిర్యాదులు ఇచ్చినా, కోర్టులలో కేసులు వేసినా ఆ జోన్ అధికారుల అండదండలతో విర్రవీగుతున్న వేలాయుధం. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని కూడా నవ్వుల పాలు చేసేంత పని చేశాడంటే ఆ అధికారిని కనీస విచారణ కూడా చేయకుండా ఉన్నారంటే ఈ సమాచార శాఖ అధికారుల తీరును ఏమని ప్రశ్నించాలి,ఇలాంటి వ్యవస్థలతో ప్రజలకు ఏ విధమైన సంక్షేమ పథకాలు వివరిస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ సారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందని పత్రికా లోకం కోరుకుంటుంది.


ఇక పోతే ఇలాంటి అవినీతి,అశ్రద్ధ , అలక్ష్యం అధికారుల తీరు ఉండడానికి ప్రధానంగా కొన్ని కారణాలు లేకపోలేదు.ఏమిటయ్యా అంటే వేలాయుధం సత్యసాయి జిల్లాలో చేసిన అవినీతి బాగోతం,రోడ్డుపై తిరుగుతున్న సమాచార శాఖ వాహనాన్ని కేవలం తన అవినీతి సంపాదన కోసం నిధులున్నా షెడ్డు పాలు చేసిన విషయం, అక్రిడేషన్ లో అవకవతలు,కింది స్థాయి ఉద్యోగుల నుండి దండుకున్న డబ్బులు ఇలాంటి విషయాలు జోన్ 4 ఆర్జేడీకి బాగా తెలుసు.అయినా ఒక్క మెమో కానీ విచారణ నివేదిక కానీ ఉన్నతాధికారులు దృష్టికి తీసుక వెళ్లలేదు.గతంలో డైరెక్టర్ గా ఉన్న హిమాన్స్ శుక్లా కు అనేక మంది అనేక రకాల పిర్యాదులు ఇచ్చినా నాడు అవినీతి అధికారులు తన కులపొల్లు అయితే చాలు ఏ అవినీతి చేసినా పర్వలేదన్న అడిషనల్ డైరెక్టర్ ఇంచార్జి మేడం స్వర్ణలత పరిపాలనలో తన సామాజిక వర్గాన్ని వెనుకేసుకుని ఈ అవినీతి అధికారిని కాపాడడం జరిగింది. డైరెక్టర్ హిమాన్స్ శుక్లా బదిలీ అయ్యారు కే ఎస్ విశ్వనాథన్ బాధ్యతలు చేపట్టాక మేడం స్వర్ణలత ఆ పిర్యాదును బుట్టదాఖలు చేశారు.ఇక జేడి అర్జేడీలు చూస్తే కేవలం వారి స్వార్థం,వారి అభ్యున్నతి,వారి వారి స్వలాభం తప్ప వారి జోన్ ల పరిధిలో ఏమి జరిగినా వారికేమి పట్టనట్లు ఉంటున్నారనేది జగమెరిగిన సత్యం.
: ఇక కొత్తగా జోన్4 ఆర్జేడీ గా బాధ్యతలు చేపట్టిన వారు ఆయనొక అభినవ అంబేద్కర్ లాంటివారు.ఆయన కు ఆయన సొంత ఊరులో ఉద్యోగం కావాలి.ఆయనకు పై అధికారులు అంటే యెనలేని గౌరవం.ఎవరయ్యా అంటే మేడం స్వర్ణలత.ఆమె చేసిన పనులు మాత్రం ఈయనకు వద్దు.వాస్తవాలు వెలుగులోకి తీసుక వస్తె ఆయన అధికారం ఉందని ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం లేక పోయినా నిజాయితీ గా పత్రికలు ప్రచురిస్తున్న రెగ్యులర్ గా తీస్తున్న ఎవడో ఒక పనికిమాలిన జర్నలిస్ట్ ముసుగులో ఉన్న యర్నలిస్ట్ ను పెద్దగా చేసిన. ఈ పత్రికా ప్రపంచానికి చీడ పురుగు లాంటి వృద్దనారీశ్వరుడు లాంటి బ్రోకర్ల తో చేతులు కలిపి అక్రిడేషన్ కార్డులు ఆపి పైశాచిక ఆనందం పొందడం ఆయన వంతయింది.మరి ఈ అభినవ అంబేద్కర్ నిజాలు రాస్తే అంత నొప్పి ఉంటే. కళ్ళ ముందే ఇన్ని అవినీతి పనులు,ఆఖరికి ముఖ్యమంత్రి పర్యటనను కూడా ఇలా సమాచారం ఇచ్చిన అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారి విజ్ఞతకే వదిలేయాలా అన్న విషయం వారే తెలుసుకోవాలని పత్రికా లోకం ఆలోచన చేస్తుంది.
ఒక చిన్న వార్త కు ఇంతలా చేయాలా అనే ఆరోపణలు చేయచ్చు ఆపై కక్ష్య సాధింపు చర్యలు తీసుకోవచ్చు ఈ అధికారులు. ఏల అంటే ప్రస్తుత డైరెక్టర్ చాలా నిక్కచ్చిగా ముక్కుసూటిగా అవినీతి అంటే సహించక పోగా ఏ చిన్న లోపం ఉన్నా మొహం మీదే అడిగి ఆ సమస్య పరిష్కరించి తీరతా అన్న ధోరణి కలిగిన గొప్ప యువ ఐఏఎస్.అయితే డైరెక్టర్ కార్యాలయం లో ఉన్న కొంతమంది అధికారులు వారి అవినీతి బాగోతం బట్టబయలు చేస్తారని అనుకుని ఒకడుగు ముందుకు వేసి డైరెక్టర్ ను నేరుగా కలిసి వాస్తవాలు తెలియజేయక ముందే సదరు పత్రిక కావచ్చు, సదరు జర్నలిస్టు పై కావచ్చు పలానా వ్యక్తి పలానా పార్టీ , పలానా విధంగా అని నానా విధాలుగా చెప్పే ప్రయత్నం చేయడంలో దిట్ట లు ఉన్నారు.అయితే నేరుగా డైరెక్టర్ ను కలిసి సమస్య ను వివరిస్తే ఆయన వాస్తవ అవాస్తవాలపై విచారణ చేయాలని ఆదేశించినా కూడా ఆయన ఆదేశాలను కూడా పక్కదోవ పట్టిస్తున్న తీరు లేకపోలేదు.అందుకు బోలెడు ఉదాహరణలు , సాక్ష్యాలు కూడా ఉన్నాయి.అయినా వీరందరిని చదివిన డైరెక్టర్ ఒక్కొక్కటిగా చర్యలు చెప్పటి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుండడం సంతోషించ దగ్గ విషయంగా చెప్పుకొస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హంద్రీనీవ జలాలకు పూజలు చేసిన కార్యక్రమం లో వైసీపీ నేతలు కూడా ఉన్నారనే అసత్యపు కథనాన్ని వెలువరించడం లో అలసత్వం వహించిన జోన్ 4 అధికారుల పై ,అసలు ఆ కథనం ఎలా వచ్చిందో పూర్తిగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పత్రికా లోకం , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అభిమానించే,ఆయనపై ప్రేమాభిమానాలు కలిగిన జర్నలిస్టులు కోరుకుంటున్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article