తాజా వార్తలుసింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో శ్రీ‌ కల్యాణ వేంకటేశ్వరస్వామి..!

సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో శ్రీ‌ కల్యాణ వేంకటేశ్వరస్వామి..!

చంద్రగిరి:శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణవేంకటేశ్వర
స్వామివారిబ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శ‌నివారం ఉదయం 8 గంట‌లకు అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో సింహ‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్‌, సూపరింటెండెంట్ వెంక‌ట‌స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article